తెలుగులో “వారసుడు” చిత్రం ఎంత వసూలు చేసిందో తెలుసా..??

తెలుగులో “వారసుడు” చిత్రం ఎంత వసూలు చేసిందో తెలుసా..??

by Anudeep

Ads

మాస్టర్, బీస్ట్ సినిమాల తర్వాత తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన సినిమా వారిసు. ఈ చిత్రంలో తెలుగులో వారసుడుగా డబ్ అయ్యింది. విజయ్ కెరీర్‌లో 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది.

Video Advertisement

 

ఇళయదళపతి విజయ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్ ప్రకారం ‘వారసుడు’ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే ఈ చిత్రం హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేసుకున్నారు. ఇలా విజయ్ వారసుడు మూవికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 137.90 కోట్లు బిజినెస్‌ జరిగింది. దీంతో రూ. 139 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నమోదు అయింది.

varasudu movie closing colletions in telugu..

‘వారసుడు’కి తెలుగు రాష్ట్రాల్లో 23 రోజుల్లో కలెక్షన్లు ఓ మోస్తరుగా వచ్చాయి. ఇక క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఏపీ తెలంగాణ మొత్తంగా ఈ సినిమా 15.05 కోట్ల షేర్‌ను,27.10 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల రూపాయల బిజినెస్ జరగ్గా.. 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరి లోకి దిగింది. దీంతో అయిదు లక్షలకు పైగా లాభాలు వచ్చినట్టు సమాచారం. తెలుగులో చిరంజీవి, బాలయ్యల సినిమాలను ఎదుర్కోంటూ.. రెండు రోజులు లేటుగా విడుదలై ఈ రేంజ్ వసూళ్లు అంటే మమాలు విషయం కాదంటున్నారు ట్రేడ్ పండితులు.

varasudu movie closing colletions in telugu..

ఇక మరో వైపు వారసుడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వారిసు టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. విజయ్ గతంలో బిగిల్ చిత్రంతో 300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాడు. ఇప్పటికే తెలుగులో థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 22న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు రానుందని తెలుస్తోంది. అంతేకాదు ఒకేసారి తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.


End of Article

You may also like