వేరే భాషల ఇండస్ట్రీల హీరోలని కూడా తెలుగు ఇండస్ట్రీ చాలా బాగా ఆదరిస్తుంది. భాషతో సంబంధం లేకుండా ఏ భాష సినిమా అయినా సరే తెలుగులో డబ్ అయితే మన తెలుగు వాళ్ళు చూసి ఒక తెలుగు సినిమాకి ఎంత మంచి స్పందన వస్తుందో అంత మంచి స్పందన వచ్చేలా చేస్తారు.

Video Advertisement

అందుకే మిగిలిన ఇండస్ట్రీల్లో కంటే తెలుగు ఇండస్ట్రీలో డబ్బింగ్ సినిమాలు చాలా ఎక్కువ. అలా డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రజలకు చేరువైన హీరో తలపతి విజయ్. విజయ్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయలేదు. అయినా సరే ఒక తెలుగు హీరోకి ఉన్నంత  క్రేజ్ ఉంది. ఇప్పుడు విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

dil raju making best plans for varisu business

ఈ సినిమాని వారిసు పేరుతో రూపొందించారు. ఇది తమిళ్ సినిమా. తెలుగులో వారసుడు పేరుతో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా పోస్టర్స్ చూసి మహర్షి సినిమాలాగా ఉంది అని అన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఒక వార్త వచ్చింది. సినిమా కథ విషయానికి వస్తే విజయ్ రాజేంద్రన్ అనే ఒక వ్యక్తి చుట్టూ సినిమా తిరుగుతుంది. విజయ్ ఒక మామూలు వ్యక్తి. విజయ్ ని ఒక కుటుంబం దత్తత తీసుకొని పెంచుకుంటుంది. ఆ కుటుంబ పెద్ద మరణిస్తాడు.

did you notice this in ranjithame song from varisu..??

అప్పటి వరకూ వేరే ఎక్కడో ఉన్న విజయ్ ఇప్పుడు కుటుంబాన్ని కలవడానికి వస్తాడు. కానీ ఇక్కడ పరిస్థితులు ఏమీ అనుకూలంగా అనిపించవు. ఉన్నట్టుండి విజయ్ ఒక వ్యాపారవేత్తగా మారాల్సి వస్తుంది. తన అన్నలకి తనకి మధ్య గొడవలు వస్తాయి. ఈ గొడవలన్నీ విజయ్ ఎలా పరిష్కరించాడు అనే విషయం చుట్టూ సినిమా తిరుగుతుంది.

thalapathy 66 vaarasudu story goes viral

విజయ్ తండ్రి పాత్రలో శరత్ కుమార్ నటిస్తున్నారు. అలాగే విజయ్ అన్నల పాత్రల్లో శ్రీకాంత్, శ్యామ్ నటిస్తున్నారు. విజయ్ తల్లి పాత్రలో జయసుధ నటిస్తున్నారు. విజయ్ కి వ్యతిరేకంగా ఉన్న కంపెనీకి ఓనర్ గా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఈ కథలో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకోవాలి అంటే సినిమా విడుదల అయ్యే అంతవరకు ఆగాల్సిందే.