ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి. ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

Varsha Immanuel start music program promo going viral

ఒక రోజు జబర్దస్త్ లో అనసూయ యాంకర్ గా మనల్ని అలరిస్తుంటే, మరొక రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. అలాగే రోహిణి, సత్య శ్రీ కూడా జబర్దస్త్ లో రెగ్యులర్ గా స్కిట్స్ లో కనిపిస్తూ ఉంటారు. గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనకు కొత్త నటి జబర్దస్త్ లో కనిపిస్తున్నారు. తనే వర్ష. వర్ష ఎక్కువగా హైపర్ ఆది టీం లో, కెవ్వు కార్తిక్ టీం లో కనిపిస్తారు.

Varsha Immanuel start music program promo going viral

అలాగే రాకింగ్ రాకేష్, వెంకీ మంకీస్ టీమ్స్ తో కలిసి నటిస్తున్నారు. అయితే వీరిద్దరూ స్టార్ మా లో టెలికాస్ట్ అయ్యే స్టార్ట్ మ్యూజిక్ ప్రోగ్రాం కి గెస్ట్ లుగా రాబోతున్నారు. వర్ష, ఇమాన్యుల్ తో పాటు జబర్దస్త్ కి చెందిన ఇంకొంత మంది కమెడియన్స్ కూడా ఈ ప్రోగ్రాం కి వచ్చారు. ఈ ప్రోగ్రాం కి సుమ యాంకర్ గా వ్యవహరిస్తారు.

Varsha Immanuel start music program promo going viral

అయితే వర్ష కి, ఇమాన్యుల్ కి మధ్య ఉన్న ప్రేమ నిజమా? కాదా? అని తెలుసుకోవడానికి సుమ వీళ్ళిద్దరికి ఒక టెస్ట్ పెట్టారు. వారిద్దరి గురించి వస్తున్న వార్తలు నిజమా, కాదా అని తెలియాలంటే, ఇమాన్యుల్ ని వర్ష బుగ్గ మీద ముద్దు పెట్టమని అన్నారు. స్టార్ట్ మ్యూజిక్ ప్రోగ్రాంకి సంబంధించిన ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.

watch video :

అయితే ఈ వీడియోకి చాలానే నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. సుమ గారి షోస్ లో కూడా టీ.ఆర్.పి కోసం ఇలా చేస్తున్నారు ఏంటి అంటూ ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు.