వర్షపై అలాంటి కామెంట్స్ చేసిన ఇమ్మాన్యుయేల్.. ఏడుస్తూ వెళ్లిపోయిన వర్ష..?

వర్షపై అలాంటి కామెంట్స్ చేసిన ఇమ్మాన్యుయేల్.. ఏడుస్తూ వెళ్లిపోయిన వర్ష..?

by Anudeep

Ads

వర్ష ఇమ్మానియేల్ కి మధ్యలో ఏం నడుస్తోంది అనేది ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఇమ్మానియేల్ ని వర్ష ప్రేమిస్తుందా అని అనుకునే వాళ్ళకి షాక్ తగిలింది. జబర్దస్త్ వేదికపై వర్ష ఇమ్మానియేల్ ప్రేమకథ మనం చూస్తూనే ఉంటాం. సుధీర్ రష్మీ తర్వాత వర్ష ఇమ్మానియేల్ ఇంత రేంజ్ లో ప్రచారాన్ని దక్కించుకున్నారు.

Video Advertisement

కొంత గ్యాప్ తరువాత వర్ష ఇటీవలే జబర్దస్త్ కి తిరిగి వచ్చింది. షరా మాములే అన్నట్లు వర్ష పై కామెంట్లకి ఏమీ కొదవ లేదు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలోపై పంచ్ లు కొంత ఘాటుగానే పడుతుంటాయి.

varsha 2

తాజాగా.. వర్షపై కూడా అలాంటి కామెంట్స్ పడ్డాయి. అయితే ఈసారి ఇమ్మాన్యుయేల్ కూడా వర్షపై కామెంట్స్ చేసాడు. సుధీర్ రష్మీ జోడికి ఉన్నట్లే.. వర్ష ఇమ్మాన్యుయేల్ జోడికి కూడా ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. వీరు స్టేజి పై ఇచ్చే పెర్ఫార్మన్స్ కోసమే చూసేవారు కూడా ఉంటారు. అయితే.. ఇటీవల హోలీని దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసిన “రంగ్ దే” షో లో మాత్రం అపశృతి చోటు చేసుకుంది.

varsha 3

ఇమ్మాన్యుయేల్ వర్ష పై దారుణంగా కామెంట్స్ చేయడం తో ఆమె ఏడ్చుకుంటూ షో నుంచి వెళ్ళిపోయింది. ఈ ఎపిసోడ్ ఈ నెల 20 న హోలీ సందర్భంగా ప్రసారం కాబోతోంది. అయితే.. ఇప్పటికే విడుదల అయిన ఎపిసోడ్ ప్రోమోలో వర్ష ఏడుస్తూ వెళ్లిపోవడం కనిపిస్తుంది. ఈ ప్రోమోలో ఒక చోట ఇమ్మాన్యుయేల్ వర్ష అమ్మాయి కాదని, మగవాడేనని కామెంట్స్ చేసాడు. లేడీస్ ఒక వైపు, జెంట్స్ ఒకవైపు కూర్చుని కామెంట్స్ వేసుకునే టైములో ఇమ్మాన్యుయేల్ ఇలాంటి కామెంట్ చేయడంతో వర్ష హర్ట్ అయింది.

varsha 1

దానికి తోడు భాస్కర్ కూడా అలాంటి కామెంట్స్ నే చేసాడు. అలా అనొద్దని.. బయట అందరు వర్ష అమ్మాయి కాదని అనుకుంటారని.. మొన్న మా ఆవిడ కూడా వర్ష అమ్మాయేనా లేక లేడీ గెటప్పా అని అడిగిందని చెప్పుకొచ్చాడు. దీనితో అందరు నవ్వారు. కానీ, వర్ష చాలా హర్ట్ అయ్యింది. అక్కడినుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అయితే వర్ష నిజంగానే హర్ట్ అయ్యిందా.. లేక టిఆర్పి రేటింగ్స్ కోసం ప్రోమో ని అలా కట్ చేశారా అన్నది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.

Watch Video:


End of Article

You may also like