Ads
హిట్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అంటే మరొక సినిమా ఎలా ఉంటుంది అనే ఆసక్తి ఉంటుంది. అలా ఇటీవల రెండు సంవత్సరాల క్రితం ఒక సినిమా ద్వారా హిట్ కొట్టిన ఒక హీరో – డైరెక్టర్ జంట, మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హీరో ప్రణవ్ మోహన్ లాల్- డైరెక్టర్ వినీత్ శ్రీనివాసన్ హృదయం సినిమా ద్వారా హిట్ సాధించారు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లోనే వర్షంగళ్కు శేషం అనే సినిమా వచ్చింది. వర్షంగళ్కు శేషం అంటే, కొన్ని సంవత్సరాల ముందు అని అర్థం. ఈ సినిమా మలయాళంలో చాలా పెద్ద విజయం సాధించింది.
Video Advertisement
ఇప్పుడు సోనీ లివ్ లో మలయాళంతో పాటు, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమ్ అవుతోంది. మలయాళ సినిమా అయినా కూడా తెలుగు డబ్బింగ్ బాగుంది. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, మురళి(ప్రణవ్ మోహన్ లాల్), వేణు(ధ్యాన్ శ్రీనివాసన్) చాలా మంచి స్నేహితులు. కొన్ని సంవత్సరాల తర్వాత వేణు చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. కానీ అప్పటికి మురళికి, వేణుకి గొడవలు అయ్యి మురళి వెళ్ళిపోతాడు. అన్ని సంవత్సరాల తర్వాత మురళి ఎక్కడ ఉన్నాడు అనే విషయం వేణుకి తెలుస్తుంది. వేణు, మురళి కోసం వెళుతూ ఉన్నప్పుడు ఆ క్యాబ్ డ్రైవర్ (వినీత్ శ్రీనివాసన్) కి వేణు తన కథ మొత్తం చెప్తూ ఉంటాడు. అసలు వేణు, మురళి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనేది సినిమా కథ.
సినిమా దాదాపు 81 కోట్లు వసూలు చేసింది. దానితో అసలు సినిమా ఎలా ఉంటుంది అని తెలుగు వారికి కూడా చూడాలి అనే ఆసక్తి నెలకొంది. కానీ సినిమా ఆశించినంత విధంగా లేదు అని చెప్పాలి. ప్రతి ఒక్క పాత్ర వచ్చి మురళి అనే పాత్రకి ఎలివేషన్ ఇస్తూ ఉంటారు. కానీ మురళి ఆ ఎలివేషన్ కి తగ్గట్టు ఉండడు. సినిమా మొత్తం అలాగే ఉంటుంది. వాళ్లు మాటల్లో మురళి గురించి చెప్తూ ఉంటారు తప్ప, మురళి అసలు అంత పెద్ద ఎలివేషన్స్ ఇచ్చే పాత్ర కాదు అనిపిస్తుంది.
వేణు పాత్రలో నటించిన ధ్యాన్ శ్రీనివాసన్, ఒక గెస్ట్ అప్పియరెన్స్ లో నటించిన నివిన్ పౌలి పాత్ర తప్ప మిగిలిన ఎవరి పాత్రలు బాగా రాసుకున్నట్టు కానీ, అందులో వాళ్ళు బాగా నటించినట్టు కానీ అనిపించవు. అమృత్ రామ్‌నాథ్ అందించిన పాటలు అలా వెళ్ళిపోతాయి. కళ్యాణి ప్రియదర్శన్ పాత్ర అయితే అసలు ఎందుకు ఉన్నారు అనేది కూడా తెలియదు. వీళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయాక చూపించే గెటప్ అసలు ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. సినిమాలో చాలా ఎమోషన్స్ కూడా సహజంగా అనిపించవు. హృదయం సినిమాతో పోలిస్తే ఈ సినిమా నిరాశ పరుస్తుంది.
సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా అర్థం లేకుండా అనిపిస్తుంది. విజువల్స్ బాగున్నాయి. రన్ టైం చాలా ఎక్కువగా ఉంది. రెండున్నర గంటల పైనే ఉంది. ఎడిటింగ్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సినిమాలో చాలా మంది నటీనటులు అతిథి పాత్రల్లో నటించారు. అసలు సినిమాలో ఎవరెవరు ఉన్నారు అని తెలుసుకోవడానికి, విజువల్స్ కోసం చూడాలి అనుకుంటే సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది. సినిమా అంతా కూడా 80-90 కాలంలోనే నడుస్తుంది. సెట్టింగ్స్ బాగున్నాయి. కానీ మొత్తంగా చూసుకుంటే మాత్రం హృదయం సినిమా ఇచ్చినంత ఇంపాక్ట్ ఈ సినిమా ఇవ్వదు.
End of Article