ఐఏఎస్ అవ్వాలన్న రాశి ఖన్నా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం వాజెలైన్..? అదృష్టం అంటే రాశి దే..!

ఐఏఎస్ అవ్వాలన్న రాశి ఖన్నా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం వాజెలైన్..? అదృష్టం అంటే రాశి దే..!

by Anudeep

Ads

చాలా మంది హీరోయిన్లు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాం అంటుంటారు. కానీ, రాశి ఐఏఎస్ అవ్వాలనుకుని యాక్టర్ అయ్యింది. క్లాస్ లో రాశి ఖన్నా మొదటి నుంచి టాపర్ గానే ఉండేది. కానీ, ఆమె యాక్టర్ కావడం వెనుక కారణం ఓ వాజెలైన్ అని తెలుసా..? ఈ ఇంట్రస్టింగ్ స్టోరీ ఏంటో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.

Video Advertisement

rasi khannaa 1

రాశి ఖన్నా ఢిల్లీ లో శ్రీ రామ్ కాలేజీ లో బిఎ (ఇంగ్లీష్) చదివారు. ఈ సమయం లో వారి కాలేజీ కి వాజెలైన్ కంపెనీ అడ్వేర్టైజ్మెంట్ ఇవ్వడానికి వచ్చారట. ఈ సందర్భం గా వారు కాలేజీ లో అమ్మాయిలకు ఒక ఆఫర్ ఇచ్చారు. వాళ్ళకి నచ్చినట్లు ఎదో ఒక స్టైల్ లో ఫోటో తీసుకోమన్నారట. తీసుకున్న వారికి వాజెలైన్ గిఫ్ట్ గా ఇస్తారట. వాజెలైన్ ని గిఫ్ట్ గా తీసుకోవడం కోసం రాశిఖన్నా కూడా ఫొటో దిగిందట.

rasi khannaa 2

అయితే, ఆమె లైఫ్ కి అదే టర్నింగ్ పాయింట్ అయింది. రాశి ఖన్నా తీసుకున్న ఫోటో నచ్చడం తో ఫెమినా మ్యాగజైన్ వారు ఆమె ఫోటో ను కవర్ ఫోటో గా వేసుకున్నారు. వాజెలైన్ కంపెనీ వారు కూడా రాశి తోనే తమ ప్రోడక్ట్ కి ప్రమోషన్ చేయించుకున్నారట. అలా ఆమె లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆమె ను చూసిన డైరెక్టర్ సుజిత్ సిర్కార్ తన “మద్రాస్ కేఫ్” సినిమా లో అవకాశం ఇచ్చారట. ఈ సినిమా లో రాశి యాక్టింగ్ స్కిల్స్ కూడా ప్రూవ్ అవ్వడం తో అవసరాల శ్రీనివాస్ “ఊహలు గుస గుసలాడే” సినిమాకు హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారట.

rasi khanna 3

“ఊహలు గుస గుస లాడే” సినిమాకి గాను రాశి సీమా (SIIMA) బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డును కూడా గెలుచుకుంది. అలా తెలుగు వారికి బాగా దగ్గరయిన రాశి కి ఇండస్ట్రీ లో అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. అలా పాపులర్ హీరోయిన్ అయిపొయింది రాశిఖన్నా.

watch video:

అదృష్టం అంటే రాశి దే..!


End of Article

You may also like