Ads
నందమూరి బాలకృష్ణకు అఖండ సినిమా తర్వాత వచ్చిన క్రేజ్ అయితే మామూలుగా లేదు అనే చెప్పాలి. ముఖ్యంగా అన్ స్టాపబుల్ షో ద్వారా కూడా బాలయ్య బాబు తన క్రేజ్ మరింత పెంచుకున్నాడు. బాలయ్య తన 107 చిత్రం ‘వీర సింహా రెడ్డి’ గోపీచంద్ మలినేని దర్శకత్వం లో చేస్తున్న విషయం తెలిసిందే.
Video Advertisement
అయితే తాను బాలయ్య కి పెద్ద అభిమానినని గోపీచంద్ మలినేని గతం లో వెల్లడించిన విషయం తెలిసిందే. తన ఫేవరెట్ యాక్టర్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు బహుశా ఆయన పొందిన ఆనందం, అనుభూతి ఇంకెవరూ పొంది ఉండరు..
‘‘చిన్నప్పుడు చొక్కాలు చించుకుని ఒక్కసారైనా కలవాలని కలలు కన్న నా హీరో. ఇండస్ట్రీకి వచ్చాక ఎలాగైనా ఆయణ్ణి డైరెక్ట్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్న నా అభిమాన మాస్ హీరో. బాలయ్యతో పని చేసే భాగ్యం కలగడం నా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ కంటే లైఫ్ టైమ్ రెస్పాన్సిబులిటీగా భావిస్తూ.. జై బాలయ్య’’ అంటూ ‘వీర సింహా రెడ్డి’ ఓపెనింగ్ రోజు గోపిచంద్ చేసిన పోస్టుతో బాలయ్య అభిమానులు సినిమా సూపర్ హిట్ అని ఫిక్స్ అయిపోయారు.
ఒక బాలయ్య వీరాభిమాని, తన అభిమాన హీరో తో సినిమా చేస్తే సూపర్ హిట్ కాక ఇంకేమవుతుంది అని ఫిలిం వర్గాల్లో చర్చించుకుంటున్నారు. వీర సింహా రెడ్డి’ స్టోరీ, సాంగ్స్, బాలయ్య డ్యాన్స్, గూస్ బంప్స్ తెప్పించే ఫైట్స్, డైనమెట్స్‌లా పేలే డైలాగ్స్, మరీ ముఖ్యంగా బాలయ్య బాబు ఎలివేషన్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి.. అంటూ ఫిలిం వర్గాల్లో టాక్స్ వినిపిస్తున్నాయి.
దీంతో మొత్తానికి మలినేని ఫ్యాన్ బాయ్ అనిపించుకున్నాడు అంటూ మురిసిపోతున్నారు బాలయ్య అభిమానులు. మరికొద్ది రోజుల్లో వెండితెర మీద ‘వీర సింహా రెడ్డి’ విజృంభణ చూడబోతున్నారు తెలుగు ప్రేక్షకులు.
End of Article