ఈ సంక్రాంతి కి బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమా తో మన ముందుకి రాబోతున్నారు. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అఖండ సినిమా తో రికార్డులని తిరిగి రాసేశారు బాలకృష్ణ. దీనితో ఎక్స్పెక్టేషన్స్ మాములుగా లేవు.

Video Advertisement

నట సింహం నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాలో హీరోగా నటిస్తుండగా శృతిహాసన్ బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు.

గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. బాలయ్య 107 వ చిత్రంగా వీర సింహా రెడ్డి సినిమా రాబోతోంది. ఈ సినిమాలో మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ మొదలైన వాళ్ళు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. అలానే వరలక్ష్మి శరత్ కుమార్ హానీ రోజ్, కన్నడ స్టార్ దునియా విజయ్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఆలరిస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఈ సినిమా పోస్టర్స్, వీడియోలు అయితే ఈ సినిమా మీద హైప్ ని పెంచేసాయి.

balayya next movie also in star maa..!!

పైగా ఈ సినిమా లో సెంటిమెంట్ సన్నివేశాలు వున్నాయట. ఆ సీన్స్ సంక్రాంతికి వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. వరలక్ష్మి బాలయ్య చెల్లెలి గా నటిస్తోంది. ఈ సినిమా లో పాటలని కూడా రిలీజ్ చేసారు. ‘జై బాలయ్య’, ‘సుగుణ సుందరి’, ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే’ పాటలు అయితే ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. అందరికీ నచ్చేసాయి. పైగా క్రాక్, అఖండ లాంటి సూపర్ హిట్  మూవీస్ తర్వాత బాలయ్య- గోపీచంద్ చేస్తున్న సినిమా ఇది కనుక తప్పకుండా ఆడియన్స్ ఈ మూవీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకుంటారు. అయితే తాజాగా ఈ వీడియో ట్రైలర్ వచ్చింది. మరి మీరు చూసేసారా..?