ఈ సంవత్సరం సంక్రాంతికి బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాలకృష్ణ గెటప్ ఇప్పటికే చాలా వైరల్ అయ్యింది. ఇందులో బాలకృష్ణతో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పాటలు ఇప్పటికే విడుదల అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యాయి.

Video Advertisement

అయితే ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఒక స్టోరీ మాత్రం ప్రస్తుతం వైరల్ గా అయ్యింది. ఈ సినిమా కథ ఏంటంటే. బాలకృష్ణ ఈ సినిమాలో తండ్రి కొడుకుల పాత్రలో నటిస్తున్నారు. కొడుకు విదేశాల్లో పని చేసే ఒక బ్యాంక్ మేనేజర్. తన తల్లితో కలిసి అక్కడే ఉంటూ ఉంటాడు.

'veera simha reddy'. is going to be a block buster.. inside talk..

అక్కడే శృతి హాసన్ తో పరిచయం అవుతుంది. శృతి హాసన్ అదే కంపెనీలో పని చేస్తూ ఉంటుంది. ఈ బాలకృష్ణ తండ్రి ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్. ఆ సమయంలో జరిగిన గొడవల్లో తన చెల్లెలి భర్త అయిన విలన్ కారణంగా ఆయన చనిపోతాడు. తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవడానికి కొడుకు అయిన బాలకృష్ణ ఇండియాకి వస్తాడు. ఈ స్టోరీ అయితే ప్రస్తుతం వార్తల్లో ఉంది.

memes on veera simha reddy song..

సినిమా స్టోరీ వింటూ ఉంటే మాత్రం అంతకుముందు చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తోంది. ఇందులో పెద్ద బాలకృష్ణ చెల్లెలి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ భర్త పాత్రలో దునియా విజయ్ నటిస్తున్నారు. పెద్ద బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా హనీ రోజ్ నటిస్తున్నారు. అలాగే బాలకృష్ణకి సహాయం చేసే వ్యక్తిగా లాల్ నటిస్తున్నారు.

NBK 107 movie title release in kurnool..!!

అలాగే పెద్ద బాలకృష్ణ పేరు వీర సింహా రెడ్డి అని అంటున్నారు. స్టోరీ నార్మల్ గా ఉన్నా కూడా పండుగ సమయం కాబట్టి ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలని కోరుకుంటారు. దాంతో ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కావాల్సినంత ఉంది అని, ఇది ఒక మంచి కమర్షియల్ సినిమాగా నిలుస్తుంది అని అంటున్నారు. మరి ఈ కథలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే సినిమా విడుదల వరకు లేదా కనీసం సినిమా ట్రైలర్ విడుదల అయ్యేంత వరకు ఆగాల్సిందే.