Home Filmy Adda Veera simha Reddy OTT: ఓటీటీ లోకి “వీరసింహా రెడ్డి” వచ్చేది ఎప్పుడంటే..?? ఆ ఓటీటీ ఫిక్స్..!!

Veera simha Reddy OTT: ఓటీటీ లోకి “వీరసింహా రెడ్డి” వచ్చేది ఎప్పుడంటే..?? ఆ ఓటీటీ ఫిక్స్..!!

by Anudeep

Veera simha Reddy OTT Release: గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలను పోషించారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు. అలాగే, థమన్ దీనికి సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే వీరసింహారెడ్డి మూవీని గతంలో మాదిరిగానే రివేంజ్ స్టోరీతో తెరకెక్కించారు.

 

 

అయితే వీరసింహారెడ్డి మూవీ సెకండాఫ్ విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే బాలయ్య అభిమానులకు మాత్రం ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది. అయితే ఈ సినిమా తుది ఫలితం ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ పార్ట్‌నర్ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ హాట్ స్టార్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: WALTAIR VERAYYA OTT RELEASE: చిరంజీవి “వాల్తేరు వీరయ్య” ఓటీటీ ఫిక్స్..!! వచ్చేది ఎప్పుడంటే..??

veerasimha reddy ott details..!!

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బాలయ్య వీరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్‌ను దాదాపుగా 14 కోట్లు పెట్టి కొన్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య గత చిత్రం అఖండ స్ట్రీమింగ్ రైట్స్ కూడా హాట్ స్టార్ వద్ద ఉన్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి విడుదలైన ఎనిమిది వారాలకు హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఫిబ్రవరి లో కానీ ఆ తర్వాత కానీ ఈ చిత్రం ఓటీటీ లోకి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

veerasimha reddy ott details..!!

వీరసింహ రెడ్డి మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 61.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ర్నాటక హక్కులు రూ. 4.50 కోట్లకు రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 6.20 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు వ్యాపారం జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా ఉంది. వీరసింహా రెడ్డి కంటెంట్ ఎక్కువగా మాస్‌కు అప్పీల్ అవ్వుతుండడంతో బి,సి సెంటర్స్‌లో వీరసింహారెడ్డి అదరగొట్టనుంది. ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేయనుందో చూడాలి.

You may also like