Waltair Verayya OTT Release: చిరంజీవి “వాల్తేరు వీరయ్య” ఓటీటీ ఫిక్స్..!! వచ్చేది ఎప్పుడంటే..??

Waltair Verayya OTT Release: చిరంజీవి “వాల్తేరు వీరయ్య” ఓటీటీ ఫిక్స్..!! వచ్చేది ఎప్పుడంటే..??

by Anudeep

Ads

Waltair Verayya OTT Release: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘వాల్తేరు వీరయ్య’ . ఇందులో మాస్ మహారాజా రవితేజ ప్రత్యేక పాత్ర చేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన చిత్రం పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడింది. చిరంజీవి వింటేజ్ లుక్, కామెడీ టైమింగ్‌ను మరోసారి ఈ సినిమాలో రీక్రియేట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. దీనికి తోడు మాస్ అండ్ క్లాస్ కలబోతగా కుదిరిన పాటలు ‘వాల్తేర్ వీరయ్య’కు రిలీజ్‌కు ముందే భారీ హైప్ తీసుకొచ్చాయి.

Video Advertisement

 

అయితే ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా మంచి వసూళ్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1500లకు పైగా థియేటర్లలో విడుదల చేశారురు. దీంతో అన్ని థియేటర్లూ మెగా అభిమానులు, ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. మాస్ కమర్షియల్ అంశాలతో ‘వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహ రెడ్డి’ చిత్రానికి గట్టి పోటీ యివ్వడానికి బరిలో దిగారు.

waltair veerayya ott update..!!

క్రేజీ కాంబోలో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య‘ హక్కుల కోసం పోటీ తీవ్ర స్థాయిలో ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఈ మూవీ డిజిటిల్ రైట్స్ కోసం చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ సంస్థ చిరంజీవి సినిమా ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని టైటిల్ కార్డ్సులో క్లారిటీ ఇచ్చారు. అలాగే వాల్తేరు వీరయ్య శాటిలైట్ రైట్స్ జెమినీ టీవీ దక్కించుకుంది. అయితే ఓటీటీ లో ఎప్పుడు విడుదల అవుతుందన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. బహుశా… ఆరేడు వారాల తర్వాత డిజిటల్ స్క్రీన్ మీదకు సినిమా వచ్చే అవకాశం ఉంది.

Waltair Verayya OTT : Release Date, OTT Platform, Satellite Rights

waltair veerayya ott update..!!

చిరంజీవి లాస్ట్ సినిమా ‘గాడ్ ఫాదర్’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సైతం నెట్‌ఫ్లిక్స్‌ దగ్గరే ఉన్నాయి. గత ఏడాది విడుదలైన ఆ సినిమా నవంబర్ 9న ఓటీటీలో విడుదల అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ రెండు చిరంజీవి సినిమాలను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. వాల్తేరు వీరయ్య చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. బాబీ సింహా, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, కేథరీన్, వెన్నెల కిశోర్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. ఊర్వశి రౌతేలా ప్రత్యేక గీతంలో కనిపించింది.


End of Article

You may also like