విక్టరీ వెంకటేష్ బాల నటుడిగా నటించిన సినిమా ఏమిటో మీకు తెలుసా..?

విక్టరీ వెంకటేష్ బాల నటుడిగా నటించిన సినిమా ఏమిటో మీకు తెలుసా..?

by Mounika Singaluri

Ads

విక్టరీ వెంకటేష్ గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో హీరోగా చేసి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఎలాంటి పాత్ర అయినా సరే విక్టరీ వెంకటేష్ చక్కగా చేసేస్తారు. అయితే వెంకటేష్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా బాల నటుడిగా కూడా నటించారట. అయితే చాలా మందికి ఈ విషయం తెలీదు. మరి వెంకటేష్ బాల నటుడిగా నటించిన సినిమా ఏమిటి అనే దాని గురించి చూద్దాం.

Video Advertisement

చాలా మంది వెంకటేష్ నటించిన మొదటి సినిమా కలియుగ పాండవులు అని అనుకుంటూ ఉంటారు. కానీ అది వెంకీ మొదటి సినిమా కాదు. నిజానికి వెంకటేష్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమ్ నగర్ చిత్రం లో నటించారు. ఆ చిత్రంలో వెంకటేష్ ని నటించమని డి.రామానాయుడు అడిగారు.

అప్పుడు బాల నటుడిగా వెంకటేష్ నటించడం జరిగింది. అయితే డి.రామానాయుడు వెంకటేష్ కి వెయ్యి రూపాయల రెమ్యునరేషన్ ని ఆ సినిమాలో చేస్తే ఇస్తానని చెప్పారు. దానికి వెంకటేష్ సరేనని బాలనటుడిగా ప్రేమ్ నగర్ సినిమా లో నటించారు. ఆ తర్వాత హీరోగా వెంకటేష్ కలియుగ పాండవులు లో నటించారు. ఈ సినిమాలో కుష్బూ వెంకటేష్ సరసన నటించారు.

కానీ నిజానికి కుష్బూ తండ్రికి ఆమె తెలుగు సినిమాలు చేయడం అస్సలు ఇష్టం లేదు. అయితే శ్రీదేవి జయప్రద వంటి హీరోయిన్ల తో రాఘవేంద్ర రావు సినిమాలు చెయ్యగా.. అవి విజయవంతం అయ్యాయి. అందుకనే ఖుష్బూ ఎలా అయినా సరే కలియుగ పాండవులు సినిమా లో నటించాలని అనుకున్నారు. ఈ సినిమా 1986 లో విడుదలయింది. మంచి హిట్ ను కూడా ఈ సినిమా అందుకుంది.

https://telugudesk.net/hero-venkatesh-child-artist-in-premnagar-movie/?fbclid=IwAR09t6ocVOkROBB31v92XYYmTWPRkJy-xZ6JI5vVvuHUSGfh7Lg1-9a2IfY


End of Article

You may also like