వెంకీ మామ నటించిన ఈ 10 సూపర్ హిట్ సినిమాలు “రీమేక్” లే అని మీకు తెలుసా.?

వెంకీ మామ నటించిన ఈ 10 సూపర్ హిట్ సినిమాలు “రీమేక్” లే అని మీకు తెలుసా.?

by Mounika Singaluri

Ads

దగ్గుబాటి హీరో వెంకటేష్ ని తెలుగు ఇండస్ట్రీ లో హేట్ చేసే వారు ఎవరు ఉండరు. అందరు ఆయన అభిమానులే. అంత గా తెలుగువారికి దగ్గరైన విక్టరీ వెంకటేష్ తాజాగా విభిన్న కథనాలతో ముందుకొస్తున్నారు. ఇటీవల ఆయన చేసిన “అసురన్” రీమేక్ మూవీ “నారప్ప” బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరో రీమేక్ మూవీ “దృశ్యం” మూవీ కూడా తొందరలోనే విడుదల కానుంది.

Video Advertisement

కెరీర్ ప్రారంభం నుంచి వెంకటేష్ అన్ని రకాల కధలకు ప్రాధాన్యం ఇస్తూ.. తనదైన శైలిలో నటిస్తూ వచ్చారు. ఇక మాస్ సినిమాలను చూస్తే ఆ సెలక్షన్ స్టైల్ వేరు అన్నట్లు ఉంటుంది. తాజాగా.. విడుదలైన నారప్ప లో మాస్ గా కనిపించిన వెంకీ మామ అందరికి తెగ నచ్చేసారు. అసలు ఇండస్ట్రీ లో ఆయనని ఇష్టపడని వారు అంటూ ఎవరూ ఉండరు. నారప్ప లో వెంకటేష్ ని తప్ప మరొకరిని ఉహించుకోలేమేమో అన్నంతగా జీవించేసారు.

venkatesh

రీమేక్ సినిమా అయినప్పటికీ… తనదైన శైలిలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మన వెంకీ మామ. ఫేస్ బుక్ లో వెంకీ యాక్టింగ్ పై చాలా మీమ్స్ ట్రెండ్ అయ్యాయి. కొన్ని తమిళ్ పేజెస్ పనిగట్టుకుని ట్రోల్ చేసినా.. మన తెలుగు పేజెస్ అందుకు ధీటుగా సమాధానమిచ్చాయి. సినిమా రిలీజ్ అయ్యాక వెంకీ మామ నటన చూసాక అందరు ఆయనకీ ఫిదా అయ్యారు. అలా.. వెంకీ మామ రీమేక్ చేసిన సినిమాలు గతం లోను మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ సినిమాల లిస్ట్ పై ఓ లుక్ వేద్దాం.

#1 నారప్ప:

1 narappa
ఇది వెంకటేష్ కెరీర్ లో బెస్ట్ మూవీ గా చెప్పుకోవచ్చు. ఇలాంటి మూవీ ని వెంకీ మామ ఎప్పుడు చేయలేదు. ఇది కూడా తమిళ “అసురన్” కి రీమేక్.

#2 జెమిని:

2 gemini
తమిళ్ మూవీ జెమిని నే తెలుగులోనూ రీమేక్ చేసారు. అయితే.. ఈ సినిమా అంతగా ఆడకపోయినా వెంకీ నటన కి మాత్రం మంచి పేరు వచ్చింది.

#3 గోపాల గోపాల:

3 omg
ఓ మై గాడ్ సినిమా ని రీమేక్ చేసి “గోపాల గోపాల” సినిమా తీసారని అందరికి తెలుసు. ఇలాంటి డిఫరెంట్ మూవీస్ చేయడం లో మన వెంకీ మామ దిట్ట.

#4 సుందరకాండ:

3 sundara kanda
ఇది కూడా రీమేక్ మూవీ అని చాల మందికి తెలియదు. తమిళ మూవీ లో భాగ్యరాజ్ నటించారు. కానీ.. వెంకీ నటించిన తీరు డిఫరెంట్ గా ఆకట్టుకుంటుంది.

#5 సూర్యవంశం:

5 suryavamsam
తమిళ సూర్యవంశం మూవీ అదే టైటిల్ లో రీమేక్ చేసారు. కానీ.. ఇది రీమేక్ అని చెప్తే కానీ తెలియలేదు.

#6 దృశ్యం:

6 drushyam
ఇది మలయాళం మూవీ. ఒరిజినల్ లో మోహన్ లాల్ వంటి స్టార్ నటించారు. సహజం గానే రీమేక్ పై చాలా ఫోకస్ ఉంటుంది. అయినా సరే వెంకీ మామ తన మార్క్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.

#7 గురు:

7 guru
ఈ సినిమా కూడా హిందీ లో “షాలా ఖదూస్” గా అలాగే తమిళ్ లో “ఇరుది సుట్రు”గా రూపొందించారు. దీనినే తెలుగు లో “గురు” గా రీమేక్ చేసారు.

#8 చంటి:

8 chanti
తమిళ్ “చిన తంబీ” కి తెలుగు రీమేక్ “చంటి” మూవీ. ఇది కూడా రీమేక్ అంటే నమ్మలేము. అమాయకుడి పాత్రలో వెంకీ మామ ఒదిగిపోయారు అంతే.

#9 ఈనాడు:

9 eenadu
హిందీ మూవీ “ఏ వెన్స్ డే” కి తెలుగు రీమేక్ “ఈనాడు”. ఈ సినిమాలో కమల్ హాసన్ తో వెంకీ మామ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. పెర్ఫార్మన్స్ విషయం లో వెంకీ మామ కొంచం కూడా తగ్గలేదు.

#10 ఘర్షణ:

10 gharshana
తమిళ్ “కాక్క కాక్క” ను తెలుగు లో “ఘర్షణ” గా రిలీజ్ చేసారు. తమిళ వెర్షన్ లో సూర్య, జ్యోతిక నటించారు. తెలుగు లో వెంకటేష్, ఆసిన్ నటించారు.


End of Article

You may also like