Ads
విక్టరీ వెంకటేష్ కు యాంటీ ఫ్యాన్స్ ఎవ్వరు ఉండరు.. అందరు ఆయన్ని అభిమానించే వారే ఉంటారు. నారప్ప సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్.. తాజాగా దృశ్యం 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Video Advertisement
మలయాళ దృశ్యం 2 సినిమాకు ఈ సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. గతంలో కూడా మొదటి పార్ట్ ని వెంకటేష్ రీమేక్ చేసారు. ఆ సినిమా కూడా తెలుగు నాట మంచి విజయం సాధించింది. ప్రస్తుతం రెండవ పార్ట్ ని మాత్రం ఓటిటీ లోనే రిలీజ్ చేస్తున్నారు.
నారప్ప సినిమా కూడా ఓటిటీ లోనే రిలీజ్ అవడం పట్ల అభిమానులు కొంత అసంతృప్తి చెందారు. తాజాగా.. దృశ్యం 2 కూడా ఓటిటిలోనే విడుదల అవుతుండడంతో.. ఈ విషయమై కొందరు వెంకటేష్ ను అడిగారు. ఓటిటిలో విడుదల అవుతున్నందుకు అభిమానులు ఫీల్ అవుతున్నారు అంటూ వెంకీ మామ దగ్గర ప్రస్తావించారు. “నా అభిమానులేమి పట్టించుకోరు.. వారి నా సినిమాలపై ఎలాంటి అంచనాలు ఉండవు.. అందుకే నేను కొత్త ప్రయోగాలు చేసుకోగలుగుతున్నాను.. ఈ రెండు సినిమాలు ఓటిటిలో విడుదల అవ్వడం అనేది నేను ప్లాన్ చేయలేదు.. ఈ సారి థియేటర్ లో చూడదగ్గ సినిమాతోనే వస్తాను.. ఎఫ్ 3 సినిమా కూడా అలాంటిదే…” అంటూ చెప్పుకొచ్చారు.
End of Article