సాధారణంగా చాలా మంది కోపంలో కానీ, లేదా ఇంకా ఏదైనా సందర్భంలో కానీ కస్ వర్డ్స్ (బూతులు) వాడతారు. అవి వ్యక్తిగతంగా మాట్లాడితే ఎవరూ పట్టించుకోరు కానీ పబ్లిక్ ప్లాట్ ఫామ్ లో మాట్లాడితే మాత్రం ఎన్నో చర్చలకు దారి తీస్తుంది. ఇటీవల ఉమెన్స్ టి20 క్రికెట్ మొదలైంది.

అందులో భాగంగా ట్రైల్ బ్లేజర్స్ మరియు సూపర్ నోవాస్ జట్లు పోటీ పడ్డారు. చివరి వరకు ఉత్కంఠ గా జరిగిన ఈ మ్యాచ్ లో రెండు పరుగుల తేడాతో సూపర్ నోవాస్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సూపర్ నోవాస్ జట్టుకు చెందిన రాధా యాదవ్ జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

అయితే మ్యాచ్ మధ్యలో బౌలింగ్ చేస్తున్నప్పుడు రాధా యాదవ్ బాల్ విసరగా, బ్యాటింగ్ చేస్తున్న హేమలత కొంచెం తడబడటంతో, వికెట్ కీపర్ హర్మన్ ప్రీత్ కౌర్ చేతిలోకి ఆ బాల్ వెళ్ళింది.

అప్పుడు వికెట్ పడగొట్టడం తో రాధా యాదవ్ ఒక కస్ వర్డ్ ఉపయోగించారు. అది కెమెరా కంటపడింది. రాధా యాదవ్ అలా కస్ వర్డ్ ఉపయోగించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
watch video :
https://twitter.com/CowCorner9/status/1325414116991774725
source : https://www.bdcrictime.com/watch-radha-yadav-uses-cuss-word-after-taking-a-wicket/?ref=wansh&fbclid=IwAR2usvfzPB_mfa8KBFKx5b9CFZAUWPlz8KatFrxTF_2YhJL-tzeYkUWuZcU
