Ads
ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగినటువంటి యాషెస్ సెకండ్ టెస్ట్ లో ఆసీస్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో జానీ బెయిర్ స్టోను ఆస్ట్రేలియన్ జట్టు ఔట్ చేసిన తీరుపై ప్రస్తుతం పలు రకాల విమర్శలు వస్తున్నాయి.
Video Advertisement
అంతేకాకుండా ఈ విషయాన్ని గతంలో టీం ఇండియా తో జరిగిన మరొక విషయంతో పోల్చి టీం ఇండియా ని చూసి ఎలా ఉండాలో నేర్చుకోండి అన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే బాల్ కీపర్ చేతిలోకి వెళ్లిన తరువాత.. ఓవర్ పూర్తి అయింది అన్న ఉద్దేశంతో బెయిర్ స్టో క్రీజు నుంచి కదిలాడు ఇది గమనించిన వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బంతితో వికెట్‌ను కొట్టి రన్ ఔట్ కి ఆపిల్ చేశాడు. బాల్ వికెట్‌కి తగిలే సమయానికి లేయర్ క్రీజులో లేకపోవడంతో అంపైర్ ఔట్ ప్రకటించారు.
— Sanju Here 🤞| Alter EGO| (@me_sanjureddy) July 2, 2023
ఇటువంటి సంఘటన 2011 లో ఇంగ్లాండ్ మరియు భారత్ మధ్య జరిగింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్ లో వైరల్ అవుతుంది. మరి ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందామా.. ఇంగ్లాండ్ మరియు ఇండియా జట్ల మధ్య ఇంగ్లాండ్ వేదికగా 2011లో టెస్ట్ సిరీస్ జరిగింది. అప్పుడు ఇంగ్లాండ్ టీమ్ రెండో టెస్టులో తన రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తుంది. ఇయాన్ బెల్ అప్పటికే సెంచరీ చేసి మంచి జోరు మీద ఉన్నాడు. సరిగ్గా అదే టైం కి ఇషాంత్ వేసిన 66వ ఓవర్ లో చివరి బంతిని రెండవ బ్యాట్స్మెన్ ఆయన ఇయాన్ మోర్గాన్ బౌండరీ వైపు కొట్టడం జరిగింది.
Once upon a time cricket was Gentleman's Game. Spirit of cricket. pic.twitter.com/kJjPYnZdzn
— Techturtle (@Techturtle028) July 2, 2023
బాల్ బౌండరీ దాటేసింది అనుకున్న బెల్.. మోర్గాన్ తో కలిసి క్రీజులోకి వెళ్లకుండా నాన్స్ట్రైకింగ్ ఎండ్ వైపు నిలబడ్డాడు. అయితే బౌండరీ చేరని ఆ బాల్ ని ప్రవీణ్ కుమార్ త్రో వేయగానే అందుకున్న ఇండియన్ ఆటగాళ్లు వికెట్ కు గిరాటేసి కొట్టారు.. ఇంకేముంది వెంటనే రన్ ఔట్ కి అప్పీల్ కూడా చేశారు. రిప్లై లో బంతి బౌండరీ లైన్ తాకలేదు అని కన్ఫామ్ చేసుకున్న అంపైర్ బెల్‌ను ఔట్ గా ప్రకటించారు.
🤐🤐🤐#EnglandCricket | #Ashes pic.twitter.com/dDGCnj4qNm
— England Cricket (@englandcricket) July 2, 2023
కానీ టీ-బ్రేక్ తర్వాత చూస్తే బెల్ బ్యాటింగ్ కి వచ్చాడు.. ఇది ఎలా జరిగింది అని అందరూ ఆశ్చర్యపోతుంటే బెల్ ఔట్ అయిన ఆపిల్‌ను టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వెనక్కి తీసుకున్నట్లు ఎంపైర్లు తెలియపరచారు. ఈ విధంగా ధోని టీం ఇండియా యొక్క క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. ఈ విషయాన్ని ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్‌తో పోల్చి టీమ్ ఇండియాని చూసి నేర్చుకోండి అని అంటున్నారు.
ALSO READ : “ఇదేం పని..?” అంటూ… తిడ్తున్న నెటిజన్లు..! ఏం జరిగిందంటే..?
End of Article