Ads
ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ముద్దుల కుమారుడు టైగర్ ష్రాఫ్, తండ్రి నట వారసుడిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి సినిమా రంగంలో ఉన్నత స్థాయి లో ఉన్నప్పుడే టైగర్ ష్రాఫ్ కూడా సినిమా రంగంలోకి రావాలని ఆశించాడు.
Video Advertisement
ఇప్పుడు బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు టైగర్ ష్రాఫ్. కొందరు స్టార్స్ కంటెంట్ తో సంబంధం లేకుండా తనకున్న బ్యాక్గ్రౌండ్ తో సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ టైగర్ ష్రాఫ్ అలా కాదు.
హీరో కి ఉండవలసిన అన్ని స్కిల్స్ మరియు టాలెంట్ కూడా టైగర్ లో ఉన్నాయి. 2014 లో హీరోపంతి చిత్రంతో గ్రాండ్ వెల్కమ్ ఇస్తూ మంచి సక్సెస్ ను సాధించాయి. ఈ చిత్రం నుంచి టైగర్ ముందుకు దూసుకు వెళ్ళిపోయాడు. అక్కడక్కడ ఒకటో రెండో ఫ్లాపులు వచ్చినా గానీ, తన స్పీడ్ కి ఎక్కడా బ్రేక్ పడలేదు అని చెప్పవచ్చు. అయితే టైగర్ ష్రాఫ్ కెరియర్ ని టాప్ ప్లేస్ లో నిలబెట్టినవి 5 చిత్రాలు. అసలు విషయం ఏంటంటే ఈ ఐదు సినిమాలు కూడా మన తెలుగు, తమిళ సినిమాల నుంచి కాపీ కొట్టినవే.
అలా కాపీ కొట్టిన ఒక యాక్షన్ సీన్ ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 2015 హీరో అజిత్ నటించిన వేదళం చిత్రంలోని యాక్షన్ సన్నివేశాన్ని, హీరోపంతి 2 చిత్రంలో టైగర్ ష్రాఫ్ కాపీ కొట్టేసాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఈ సన్నివేశంలో అజిత్ నటన అదిరిపోయేనట్లు ఉంటే, అచ్చు అలాగే కాపీ కొట్టినా టైగర్ ష్రాఫ్ నటన హాస్యాస్పదంగా ఉందంటూ నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
https://www.instagram.com/reel/CeGJl9yp4I7/?igshid=YmMyMTA2M2Y=
End of Article