Home Sports Adda కెప్టెన్సీకి గుడ్ బై చెబుతూ కంటతడి పెట్టుకున్న కోహ్లీ.! (వీడియో)

కెప్టెన్సీకి గుడ్ బై చెబుతూ కంటతడి పెట్టుకున్న కోహ్లీ.! (వీడియో)

by Mohana Priya

షార్జా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు విజయం సాధించింది. కెప్టెన్ గా విరాట్ కోహ్లీకి ఇదే చివరి సీజన్ కావడంతో టైటిల్ కల నెరవేరకుండానే కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బాయ్ చెప్పేసేయాల్సి వచ్చింది. దాంతో ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయ్యారు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మైదానంలోనే విరాట్ కోహ్లీ కంటతడి పెట్టుకున్నారు. కోహ్లీని చూసిన ఏబి డివిలియర్స్ కూడా ఎమోషనల్ అయ్యారు.

ఇదంతా చూసిన బెంగుళూరు జట్టులోని మిగిలిన ప్లేయర్స్ అందరూ, వారిద్దరిని ఓదార్చడానికి ప్రయత్నించారు. కానీ కోహ్లీ మాత్రం బాధ తట్టుకోలేక అలాగే కన్నీటితో డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళిపోయారు. ఐపీఎల్ 2016 లో ఫైనల్ కి చేరిన బెంగళూరు జట్టు, మళ్లీ ఇన్ని సీజన్ల తర్వాత ప్లేఆఫ్స్ కి చేరింది. అంతే కాకుండా చాలా మంది ఈసారి బెంగళూరు జట్టు టైటిల్ గెలుస్తుందేమో అనుకున్నారు.

video of virat kohli crying after leaving captaincy

కానీ ఒత్తిడిని జట్టు అధిగమించలేకపోయింది. కెప్టెన్ గా తనకి ఇదే చివరి సీజన్ అని కోహ్లీ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. దాంతో కోహ్లీకి టైటిల్ తో సెండ్ ఆఫ్ ఇవ్వాలి అని బెంగళూరు క్రికెటర్లు ఆశించారు. కోహ్లీ కూడా ఈసారి టైటిల్ ఎలాగైనా వారికే సొంతం అవ్వాలి అని చాలా శ్రమించారు. ఎలిమినేటర్ మ్యాచ్ అయిన తర్వాత ఐపీఎల్ లో ఆడినన్ని రోజులు బెంగళూరు టీంకి ఆడుతాను అని కోహ్లీ చెప్పారు.

watch video :

https://twitter.com/A_Politickle/status/1447848975646683137

You may also like