Nayanthara: తనలా ఎవ్వరూ చేయలేరేమో.. ”నయనతార” పై అత్తగారి కామెంట్స్, వైరల్

Nayanthara: తనలా ఎవ్వరూ చేయలేరేమో.. ”నయనతార” పై అత్తగారి కామెంట్స్, వైరల్

by kavitha

Ads

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డిఫరెంట్ పాత్రలు చేస్తూ  స్టార్ హీరోయిన్ గా  ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్న నయనతార  డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. కొన్నేళ్లుగా  ప్రేమలో ఉన్న నయన్, విగ్నేష్ లు ఈమధ్యే  మూడుముళ్లతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుండి ఈ  క్యూట్ కపుల్ ఏదో ఒక రకంగా  వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

Video Advertisement

ఇటీవల విగ్నేష్ తల్లి  ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఆమె తన కోడలు నయనతార గొప్పతనం గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ నయనతార అత్త అంటే విగ్నేష్ తల్లి మీనా కుమారి ఇలా చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ నా కొడుకు మంచి డైరెక్టర్‌, నా కోడలు నయనతార  స్టార్‌ హీరోయిన్‌. వాళ్ళిద్దరు కష్టపడి పనిచేయడం ఒకటే కాదు. వాళ్ళలా కష్టపడి పనిచేసేవాళ్లను అంతే గౌరవిస్తారు.
nayanthara-telugu-addaనయనతార ఇంట్లో ఎనిమిది మంది పనివాళ్లు పని చేస్తారు. అయితే పనిచేసేవారిలో ఒకరికి 4 లక్షల అప్పు ఉందని తెలియగానే, వెంటనే నయనతార వారికి ఉన్న 4 లక్షల రూపాయల అప్పు తీర్చేసింది. పని వారి కష్టం తెలుసుకుని, తీర్చే గొప్ప మనసు నా కోడలిదని, అంతేకాకుండా తన దగ్గర పనిచేసేవాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అలా చేసేందుకు పెద్ద  మనసు ఉండాలి. తన కోడలు పది మంది చేసే పనిని తనొక్కతే  చేయగలదు అంటూ నయనతారను పొగిడింది విగ్నేష్ తల్లి మీనా కుమారి.
nayanataraఅయితే విగ్నేష్ తల్లి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో  వైరల్ అవుతున్నాయి. ఇటీవలే నయనతార దంపతులు సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారారు. మరో వైపు నయనతార పెళ్లి తర్వాత కూడా సినిమాలలో అదే ఉత్సాహంతో నటిస్తోంది.ప్రస్తుతం ఆమె చేతి నిండా చాలా  ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక అత్యదిక పారితోషికం తీసుకుంటున్న స్టార్  హీరోయిన్లలో ఇప్పటికీ నయనతార టాప్ ప్లేస్ లో ఉంది.


End of Article

You may also like