కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని కుమార్తె ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న మీరా ఆంటోనీ మంగళవారం నాడు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తన గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

Video Advertisement

మీరా మరణంతో తమిళ సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగింది.  జైలర్ నటుడు, డైరెక్టర్‌ జి మారిముత్తు ఇటీవలే గుండెపోటుతో మరణించాడు. ఆ విషయం నుండి ఇండస్ట్రీ తెరుకోకముందే విజయ్ ఆంటోని కుమార్తె కన్నుమూసింది. తన కుమార్తె మరణంతో విజయ్ ఆంటోని తీవ్ర దుఖంలో ఉన్నాడు. తన కుమార్తె చివరి కోరికను తీర్చలేకపోయానని, తన కుమార్తె గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
విజయ్ ఆంటోని కుటుంబం చెన్నైలోని డిడి కే రోడ్ లో నివసిస్తుంది. విజయ్ ఆంటోనీ, ఫాతిమా దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. వారి పేర్లు మీరా ఆంటోనీ, లారా ఆంటోని. పెద్ద కుమార్తె మీరా వయసు 16 సంవత్సరాలు. ఆమె చర్చ్ పార్క్ హై స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే ఈమె ప్రయాణం తీసుకోవడానికి కారణం డిప్రెషన్ అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఆమె గత కొద్దిరోజులుగా డిప్రెషన్ కు ట్రీట్మెంట్ తీసుకుంటుందని అంటున్నారు.
గారాల కుమార్తె మీరా దూరం అవడం హీరో విజయ్ ఆంటోనీ జీర్ణించుకోలేకపోతున్నాడు. పిల్లలే లోకంగా బ్రతికే తండ్రి, వారిలో ఒకరు శాశ్వతంగా దూరం అయితే కలిగే దుఖాన్ని ఎవరూ ఓదార్చలేరు. కుమార్తె మీరాతో పాటు తాను కూడా చనిపోయానని విజయ్ ఆంటోనీ చేసిన ట్వీట్ అందరి హృదయాలను కలిచివేస్తోంది. తన జీవితంలో ఎన్నో కోల్పోయిన విజయ్ ఆంటోని ఇప్పుడు కుమార్తెను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నాడు.
తన కుమార్తె మీరా ఆంటోని అడిగిన ఆఖరి కోరికను తీర్చలేకపోయానని ఆయన చాలా బాధపడుతున్నారట. మీరా థాయిలాండ్ కు తీసుకువెళ్లమని కోరిందంట. అయితే విజయ్ ఆంటోనీ బిజీ షెడ్యూల్స్ వల్ల తీసుకెళ్లలేకపోయాడట. ఇక ఈ విషయాన్ని గుర్తు చేసుకుని మరింతగా విజయ్ బాధపడుతున్నారు.

Also Read: విజయ్ ఆంటోనీ కూతురు చనిపోయే ముందు రాసిన చివరి లెటర్..! “వాళ్లని మిస్ అవుతాను..!” అంటూ..?