Ads
సోషల్ మీడియా అనేది కేవలం ఒక ప్రాంతం, దేశంకి మాత్రమే పరిమితం అవ్వదు. ఏదైనా ఒక విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ప్రపంచమంతా చూస్తుంది. అందుకే సోషల్ మీడియాకు చాలా పవర్ ఉంది. అయితే, సోషల్ మీడియా అంటే మన అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మాత్రం ఎంటర్టైన్మెంట్. సోషల్ మీడియాలో ఎంతో మంది వెరైటీ కంటెంట్ తో మనల్ని ఎంటర్టైన్ చేస్తారు.
Video Advertisement
కొంత మంది మీమ్స్ ద్వారా మనల్ని నవ్విస్తే కొంత మంది ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తారు. కొంత మంది మాత్రం సోషల్ మీడియాని ముఖ్యమైన విషయాలను అందరికీ తెలపడానికి ఒక మాధ్యమం గా ఉపయోగిస్తారు. అయితే ఇందాక పైన చెప్పినట్టుగా సోషల్ మీడియాలో ఏదైనా విషయం ఉంటే ప్రపంచమంతా చూస్తారు.
సోషల్ మీడియా కంటెంట్ విషయానికొస్తే మన వైపు ఉన్న కంటెంట్ కి, నార్త్ ఇండియన్ కంటెంట్ కి కొంచెం తేడా ఉంటుంది. వాళ్లు కూడా మీమ్స్ చేస్తారు వాళ్లలో కూడా సోషల్ మీడియా సెలబ్రిటీలు ఉంటారు. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు చేసే వీడియో ఎడిట్స్ కొంచెం వింతగా ఉంటాయి.
ఒక సినిమాలోని ఒక క్లిప్పింగ్ ని ఆ సీన్ సందర్భమే మార్చేసి, ఏదో ఒక పాటని యాడ్ చేసి, ఎడిట్ చేసి సోషల్ మీడియాలో, కానీ యూట్యూబ్ లో కానీ పోస్ట్ చేస్తారు. అలా ఇటీవల డియర్ కామ్రేడ్ సినిమాలోని ఒక సీన్ ని ఇలాగే సందర్భం మొత్తం మార్చేసి పోస్ట్ చేశారు. అందులో ఒక సీన్ లో, హీరోకి హాస్పిటల్ లో హీరోయిన్ వాళ్ళ అక్క కనిపిస్తుంది.
ఈ సీన్ ని ఆంటీ లవర్ వాట్సాప్ స్టేటస్ అని పేరుతో ఎడిట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఇంకొక విషయం ఏమిటంటే దీనికి మిలియన్ల లో వ్యూస్ ఉన్నాయి. ఇది ఒకటి మాత్రమే కాదు ఇలాగే వింత వింత పేర్లతో వీడియోలను ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తారు. ఇది ఇది ఎక్కువగా నార్త్ ఇండియన్ పేజెస్ నుండే వస్తుంది. ఈ డియర్ కామ్రేడ్ పై సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి.
End of Article