Ads
హీరోలు ఎన్ని సినిమాలు చేసినా కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. వారు బయట మాట్లాడే మాటలు, “అతను మనలో నుండి వెళ్ళిన వ్యక్తి” అని అనిపించేలాగా ఉంటే సినిమా హిట్ అవుతుంది అని అనుకుంటారు. కొంత మంది హీరోలు అందుకే వారి వ్యక్తిగత జీవితాలు, వారు పడ్డ కష్టాలు గురించి మాట్లాడుతారు. కొన్ని సార్లు ఇవి ప్రేక్షకులకి సాధారణంగా అనిపిస్తాయి. కానీ కొన్ని సార్లు మాత్రం ఎక్కువగా చేసి చెబుతున్నట్టు అనిపిస్తాయి. హీరోలు తమని తాము మిడిల్ క్లాస్ అని చెప్పుకోవడానికి మాట్లాడే మాటలు అస్సలు సూట్ అవ్వనట్టు అనిపిస్తాయి.
Video Advertisement
అందుకు ఇటీవల విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు ఉదాహరణ. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ వ్యక్తి పాత్రలో, డబ్బులు ఆదా చేసే వ్యక్తి పాత్రలో కనిపిస్తున్నారు. మిడిల్ క్లాస్ వ్యక్తి అయినా కూడా బ్రాండెడ్ దుస్తుల్లో, బ్రాండెడ్ చెప్పుల్లో ఉన్నారు. ఆ విషయం పక్కన పెడితే, ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, తనకి డబ్బుల్లేవు అని తాను ఎప్పుడూ బాధపడలేదు అని, పెళ్లిచూపులు సినిమా వరకు తనకి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించలేదు అని చెప్పారు.
దాంతో ప్రేక్షకులు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే, “విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా కూడా, డబ్బులు లేని కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. అందుకే, వినే వాళ్ళు ఉన్నారు కదా అని ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు” అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇది మాత్రమే కాదు. ఖుషి సినిమా ముందు వరకు తనకి చాలా తక్కువ డబ్బులు వచ్చేవి అని, ఆ సినిమా నుండి తాను తన మార్కెట్ కి తగ్గట్టు డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాను అని చెప్పారు. ఇది కూడా తప్పు అని కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ కోసం ఇవన్నీ మాట్లాడడం ఏంటి అని అంటున్నారు.
watch video :
పెళ్లి చూపులు తరువాత నా బండికి ఫుల్ ట్యాంక్ కొట్టించా!
– #VijayDeverakonda #FamilyStar #FamilyStarOnApril5th pic.twitter.com/TTz2HZciZP— iDream Media (@iDreamMedia) April 3, 2024
ALSO READ : ఆల్ టైమ్ రికార్డ్ సాధించిన పృథ్వీరాజ్ సుకుమారన్ కొత్త సినిమా..! ఇప్పటి వరకు ఇలాంటిది జరగలేదు..!
End of Article