విజయ్ ఎనిమిది వందల కుటుంబాలకి ఎంత మొత్తం సహాయం చేశారంటే..?

విజయ్ ఎనిమిది వందల కుటుంబాలకి ఎంత మొత్తం సహాయం చేశారంటే..?

by Mohana Priya

తమిళ హీరో అయినా సరే తెలుగులో క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్. ఇటీవల లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఇప్పుడు గోట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Video Advertisement

అయితే విజయ్ ఇటీవల వర్షాల వల్ల నష్టపోయిన ఎనిమిది వందల కుటుంబాలకు సహయం చేశారు. వీరందరికీ విజయ్ ఒకొక్క ఇల్లు కోల్పోయిన కుటుంబానికి 50 వేల రూపాయలు అందించినట్టు సమాచారం. అంతేకాకుండా వారికి ఆహారం బట్టలు వంటివి కూడా అందజేశారు.

విజయ్ చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. విజయ్ ఇలా చేయడం మొదటిసారి ఏమీ కాదు. అంతకుముందు కొంతమంది విద్యార్థులకు కూడా ఆర్థిక సహాయం చేశారు. ఇంకా చాలా సామాజిక కార్యక్రమాల్లో విజయ్ పాల్గొంటారు. ఇలాంటి పనులు విజయ్ చాలా సంవత్సరాల నుండి చేస్తున్నారు. గతంలో కూడా ఎంతోమంది వరద బాధితులకి లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల బాధపడిన కుటుంబాలకి ఎంతో సహాయం చేశారు. ఇప్పుడు కూడా ఈ విధంగా సహాయం చేసి తన పెద్ద మనసుని చాటుకున్నారు.

విజయ్ ఇంకా కొన్ని సినిమాలు చేసి తర్వాత రాజకీయాల మీద పూర్తి దృష్టి పెట్టబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. విజయ్ రాజకీయాల్లోకి వెళ్తారు అన్న వార్త ఎప్పటినుండో ప్రచారంలో ఉంది. కానీ సమయం ఎప్పుడు అనేది సరిగ్గా ఎక్కడ ప్రకటించలేదు. ఇప్పుడు ఇవి అన్ని చూస్తూ ఉంటే విజయ్ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు అని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో కూడా విజయ్ పాల్గొంటారు. అంతే కాకుండా సినిమాలు కూడా చేస్తారు. కానీ అది ఎప్పటి వరకు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.


You may also like

Leave a Comment