మురళీధరన్ బయోపిక్ నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి…అసలు కారణం ఇదే

మురళీధరన్ బయోపిక్ నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి…అసలు కారణం ఇదే

by Mohana Priya

Ads

గత కొంత కాలం నుండి బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఎంతోమంది వాళ్ల వాళ్ల రంగాల్లో పేరు పొందిన వారు, అంత ఎత్తుకు ఎదిగే క్రమంలో ఎన్ని కష్టాలను చూశారు? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? వాళ్ల వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది? ఇలాంటి విషయాలు ఎక్కువగా అందరికీ తెలియదు. కాబట్టి ఈ విషయాలను కొంచెం సినిమాటిక్ గా స్క్రీన్ పై చూపించడానికి ఎంతో మంది దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు.

Video Advertisement

అంతేకాకుండా సెలబ్రిటీలు మాత్రమే కాకుండా, ఎన్నో త్యాగాలు, ఎన్నో మంచి పనులు చేసి, ఇంకా గుర్తింపు అవసరమైన ఎంతోమంది జీవితాలను కూడా సినిమా రూపంలో మనకి పరిచయం చేస్తున్నారు. అలాగే నటులు కూడా ఒక నిజజీవిత వ్యక్తి పాత్రను పోషించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ప్రకటించారు. ఇందులో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి ముత్తయ్య మురళీధరన్ గా నటిస్తున్నారు. సినిమా పేరు 800.

ఎప్పుడైతే సినిమా ఎనౌన్స్ చేశారో, అప్పటి నుంచి ఏదో ఒక వివాదం వస్తూనే ఉంది. విజయ్ సేతుపతి, ముత్తయ్య మురళీధరన్ గా నటించకూడదని ట్విటర్ లో “షేమ్ ఆన్ విజయ్ సేతుపతి (#ShameOnVijaySethupathi)” అనే హాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేశారు. దాంతో ముత్తయ్య మురళీధరన్ ఒక నోట్ విడుదల చేశారు.

అందులో, “విజయ్ సేతుపతి లాంటి గొప్ప నటుడి కెరియర్ లో ఇబ్బందులు రావడానికి తను కారణం అవ్వకూడదు అని, భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలు ఎదుర్కోకూడదు అని, అందుకే విజయ్ సేతుపతిని తప్పుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను అని,భవిష్యత్తులో రాబోయే క్రికెటర్లకు స్ఫూర్తినిస్తుంది అనే ఉద్దేశంతో మాత్రమే తన బయోపిక్ కి అంగీకరించాను అని, కానీ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అవన్నీ దాటుకొని సినిమా రూపొందాలి అని ఆశిస్తున్నాను అని, ప్రొడక్షన్ హౌస్ వాళ్లు తొందరలో అనౌన్స్మెంట్ చేస్తామని హామీ ఇచ్చారని, వాళ్ల ప్రతి ఎఫర్ట్ లో వాళ్ళతోనే ఉంటాను” అని ఆ నోట్ యొక్క సారాంశం.

 

తమిళులకు, శ్రీలంకకు వివాదం ఏంటి?

తమిళులకు, శ్రీలంకకు మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ప్రధాని మహింద రాజపక్సకు గతంలో శ్రీలంక తమిళుడు అయిన ముత్తయ్య మురళీధరన్ మద్దతు తెలిపారు. అయితే శ్రీలంకలో 3 దశాబ్దాలపాటు తమిళ టైగర్స్ అంతర్యుద్ధాన్ని అంతమొందించడంతో పాటు లక్షల మంది తమిళులను ఊచకోత కోశాడని రాజపక్సపై ఆరోపణలున్నాయి. అలాంటి వ్యక్తికి మద్దతు తెలిపిన మురళీధరన్ బయోపిక్ ‘800’లో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించడం తమిళులకు నచ్చలేదు. . ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మురళీధరన్‌ చిత్రంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై విజయ్ సేతుపతి సోషల్ మీడియా వేదికగా తాను ఈ సినిమా నుండి తప్పుకుంటున్నారు అని అర్థం వచ్చేలా “థాంక్యూ, గుడ్ బై  (నండ్రి, వణక్కం)” అని పోస్ట్ చేశారు.


End of Article

You may also like