చదివింది పదో తరగతే.. కానీ కోట్ల రూపాయలతో బిజినెస్.. ఈమె స్టోరీ తెలిస్తే హ్యాట్సాఫ్ అనకుండా ఉండలేరు..!

చదివింది పదో తరగతే.. కానీ కోట్ల రూపాయలతో బిజినెస్.. ఈమె స్టోరీ తెలిస్తే హ్యాట్సాఫ్ అనకుండా ఉండలేరు..!

by Anudeep

Ads

ఆమె పేరు వర్కాల విజయలక్ష్మి. ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లోని కొయ్యలగూడెం లో నివాసం ఉంటున్నారు. తల్లితండ్రుల వద్ద ఉన్నప్పుడే పదవ తరగతి వరకు చదువుకుంది. ఆ తరువాత ఆమెకు పెళ్లి చేసారు. పెళ్లయ్యాక ఆమె తన భర్తకి వృత్తి పనుల్లో సాయం చేస్తూ ఉండేది.

Video Advertisement

ఆమె మామగారు, భర్త కలిసి నేత పని చేసేవారు. అది సాగితేనే వారికి ఇల్లు గడిచేది. అయితే.. పట్టణ ప్రాంతాలలో మహిళలు చీరలు కట్టడం తగ్గించడంతో వారి వ్యాపారానికి అప్పుడప్పుడు లాస్ వస్తుండేది.

vijayalakshmi 4

ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు తప్పేవి కావు. వస్త్ర పరిశ్రమలో కూడా యంత్రాలు ఎక్కువ అయ్యాయి. దీని ప్రభావం నేత పరిశ్రమపై కూడా పడింది. ఈ క్రమంలో ఇల్లు గడవడం కొంచం ఇబ్బందిగా ఉండేది. దీనితో విజయలక్ష్మి ఆలోచనలో పడింది. తనవంతు సాయంగా ఏదోకటి చేయాలనీ భావించేది. అనుకున్నదే తడవుగా మహిళా స్వయం సహాయక సంఘంలో చేరింది. అక్కడే అధ్యక్షురాలు కూడా అయ్యింది.

vijayalakshmi 1

ఆమె తపన, జిజ్ఞాసను చూసిన SERP , DRDA అధికారులు ఆమెకు స్వామి రామానంద తీర్ధ గ్రామీణ సంస్థ ద్వారా మూడు నెలల శిక్షణ ఇచ్చారు. ఆమె అక్కడ కొత్త పాఠాలు నేర్చుకుని మరో మూడొందల మందికి శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగింది. డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాలు, బ్యాగ్స్ తయారీ, అందంగా డిజైన్స్ ని రూపొందించడం వంటి అన్ని విషయాల్లోనూ ఆమె శ్రద్ధ తీసుకుంటారు.

vijayalakshmi 2

అంతేకాదు.. క్వాలిటీ, సమయానికి డెలివరీ చేయడం వంటి ఏ ఒక్క విషయంలోనూ విజయలక్ష్మి రాజీ పడరు. అందుకే ఆమె వ్యాపారం దినదిన ప్రవృద్ధి చెందుతోంది. క్రమంగా ఆమె వ్యాపారం విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. “విజయలక్ష్మి ఇక్కత్ ఫ్యాబ్” పేరిట నడిచే ఆమె బిజినెస్ ఏడాది ఆదాయం నాలుగు కోట్ల పై చిలుకే ఉంది. పుట్టింటివైపు, అత్తింటివైపు చేనేత కుటుంబమే కావడంతో ఈ రంగంలో ఏదైనా సాధించాలన్న తపన ఆమెను మరింత ముందుకు తీసుకెళ్లింది.

vijayalakshmi 3

ఆమె భర్త కూడా కొంతకాలం పాటు ఢిల్లీ, ముంబై వంటి పట్టణాలకు వెళ్లి మరీ సరుకుని అమ్మేవారు. దీనిద్వారా వ్యాపారానికి మార్కెటింగ్ కూడా అవసరమేనని ఆమె గుర్తించింది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని వీవర్స్ సర్వీస్ సెంటర్ ను సంప్రదించింది. పరిధిని విస్తరించుకోవాలని భావించింది. మరోవైపు ప్రభుత్వ ప్రదర్శనలలో కూడా పాల్గొనేది. తద్వారా వినియోగదారులు ఎటువంటి డిజైన్స్ ను ఇష్టపడుతున్నారు అన్న విషయాన్నీ గుర్తించేది.

vijayalakshmi

విజయలక్ష్మికి ఇద్దరు అమ్మాయిలు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా సివిల్స్ కి ప్రిపేర్ అయ్యేవారికి పాఠాలు బోధిస్తుంది. రెండో అమ్మాయి మైక్రోసాఫ్ట్ లో పని చేస్తోంది. ఇక కొడుకు కూడా కాగ్నిజంట్ లో కొంతకాలం పని చేసాడు. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నాడు. కొడుకు చదువు పూర్తయ్యాక అతని సాయంతో ఇతరుల అవసరం లేకుండా తన సరుకుని విదేశాలకు కూడా ఎగుమతి చేయాలన్న ఉద్దేశ్యంలో విజయలక్ష్మి ఉంది. ఏమి లేని స్థాయి నుంచి.. నేడు మరో 300 ల మందికి ఉపాధి నిచ్చే స్థాయికి వచ్చిన విజయలక్ష్మి తన గమ్యాన్ని తొందరలోనే చేరుకోవాలని కోరుకుందాం.


End of Article

You may also like