Ads
వినవే బర్రె పిల్ల . నువ్వినవే బర్రె పిల్లా….నేనా యెర్రిగొల్ల….అంటూ గతంలో ఓ పాట టిక్ టాక్ లో హడావుడి చేసింది గుర్తుందా.? టిక్ టాక్ లో సరదాగా సాగే బిట్ వరకే ఉంది ..కానీ ఈ పాట మొత్తం వింటే అసలైన సాహిత్యం తెలుసుకునే అవకాశం కలుగుతుంది. వినవే బర్రె పిల్ల … నువ్వినవే బర్రె పిల్లా… ఈ పాట ఎన్టీఆర్ నటించిన వీరకంకణం (1957 ) అనే సినిమాలోనిది. దక్షిణామూర్తి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్…ఆయన సృష్టించినదే ఈ బర్రె పిల్లా పాట.! అయితే ఈ పాటలో తను చెప్పాలి అనుకున్న మాటలను వినవె బర్రె పిల్ల అంటూ చెబుతారు. ఆ పాట లిరిక్స్ ఒకసారి మీరే చూడండి.
Video Advertisement
నిజానికి మంచోడే…నెల కూలి పోతాడే.
అన్నొడే నా ఎర్రి గొల్ల….ఇది విన్నావా బర్రె పిల్ల
గొప్పోళ్ళ ఆటలన్నీ …గుట్టు మట్టుబయట పెట్టి…
గొప్పోళ్ళ ఆటలన్నీ చెప్పుకుంటే సిగ్గు చేటు.!
వినవే బర్రె పిల్ల,నువ్వినవే బర్రె పిల్లా… నేనే నా ఎర్రి గొల్ల
పచ్చి మోసగాడే పెట్టె మంచం పానుపుకెక్కి పవళించుతాడట …
ఆది మాట వినని వాడే మాడి మరణించుతాడే…
వినవే బర్రె పిల్ల,నువ్వినవే బర్రె పిల్లా… నేనే నా ఎర్రి గొల్ల
నాయకుడి వేషం ఏసి..నమ్మించి మోసగించి కోట్లకు పడిగెత్తుతారు కదే.
ఊరు మంచి కోరి రోజల్లా… పాటు పడే బీదోళ్లు బూడిదవుతారే
ఎవరెవరో …బాగుకుంటారే.!
వినవే బర్రె పిల్ల,నువ్వినవే బర్రె పిల్లా… నేనే నా ఎర్రి గొల్ల.
watch video:
watch video:
End of Article