సినీ ప్రముఖుల జీవితాల్లో జరిగిన ఆసక్తికరమైన సంఘటనలు షేర్ చేసుకునే ఒక ప్లేట్ ఫార్మ్ ‘అలీతో సరదాగా’. ప్రముఖ ఈటీవీ ఛానల్ లో ప్రసారం అయ్యే ఈ ప్రోగ్రాం కి ప్రతి వారం ఎవరో ఒకరు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి తమ సినీ జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘటనలు షేర్ చేసుకుంటూ ఉంటారు.

అలా ఈవారం హీరో వినీత్ వచ్చారు. తన సినీ జీవితం లో మైలురాయిగా నిలిచిన ‘ప్రేమ దేశం’ సినిమా లో ‘ముస్తఫా ముస్తఫా’ పాట చిత్రీకరణ సమయం లో జరిగిన ఒక ఆసక్తికరమైన ఘటన గురించి చెబుతూ…చెన్నై పట్టణం లోని మేరియా బీచ్ వద్ద ఉన్న ఒక కాలేజ్ లో ఒక పెద్ద గ్యాంగ్ తమ పై ఎటాక్ చేయడానికి వచ్చారని తెలిపారు.

Prema Desam Movie

Prema Desam Movie

దీనికి కారణం డాన్సర్ ఒక పల్లీలు అమ్మేకునే పిల్లలతో గొడవ ఆ డాన్సర్ చేసిన పనికి ఒక వాడ లోని జనం అంత దాడి చేయడానికి వచ్చారని చెప్పాడు. అంతే కాదు అబ్బాస్ గురించి చెబుతూ ఇప్పటికి తాము మాట్లాడుకుంటూనే ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం అబ్బాస్ న్యూ జిలాండ్ లో సెటిల్ అయ్యారట.