Ads
టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సారథ్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తీసుకొచ్చిన ఒక కొత్త రూల్ పై విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా లాక్ డౌన్ లో మ్యాచెస్ జరగలేదు. దాంతో ఐసీసీ కమిటీ పర్సంటేజ్ ఆఫ్ పాయింట్స్ (PCT) అనే నిబంధనను తీసుకువచ్చింది. దీని ప్రకారం ఒక జట్టు విజయాల శాతం ఆధారంగా ఆ జట్టు యొక్క స్థానం మారుతుంది.
Video Advertisement
మంగళవారం ఇంగ్లాండ్ తో జరిగిన ఫస్ట్ టెస్ట్ లో భారత్ ఓడిపోయింది. ఈ కారణంగా టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్స్ టేబుల్ లో టీమిండియా నాలుగో స్థానంలో ఉంది. దీనిపై విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ “దీనివల్ల మాకు ఏమీ మారలేదు. ఒకవేళ లాక్ డౌన్ కారణంగా సడన్ గా రూల్స్ మారితే, అది మా కంట్రోల్ లో లేదు.
మేము ఫీల్డ్ లో ఏం చేయగలుగుతాము అనే ఒక్క విషయాన్ని మాత్రమే మేము కంట్రోల్ చేయగలుగుతాం. మేము ఈ టేబుల్స్ గురించి, బయట జరిగే విషయాల గురించి పట్టించుకోవడం లేదు. కొన్నిటికి అసలు లాజిక్ లేదు. ఈ స్థానాల విషయంపై ఎంత సేపైనా కూర్చొని వాదించవచ్చు.
కానీ ఆట బాగా ఆడడం వరకే మా చేతుల్లో ఉంది. ఎవరు ముందు స్థానంలో ఉన్నారు? ఎవరు తర్వాత స్థానంలో ఉన్నారు? అనే విషయాలను మేము అసలు పట్టించుకోవడం లేదు. మేము ఫోకస్ చేస్తున్నది కేవలం ఆట బాగా ఆడటంపై మాత్రమే ” అని చెప్పారు.
End of Article