“విరూపాక్ష” సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

“విరూపాక్ష” సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

by kavitha

Ads

మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా,  సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన సినిమా ‘విరూపాక్ష’. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అయిన కార్తీక్ వర్మ దండు తెరకెక్కించారు. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకి కథను  సమకూర్చారు. మిస్టిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘విరూపాక్ష’ చిత్రం ఏప్రిల్ 21న విడుదల కానుంది.

Video Advertisement

ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ సినిమా పై ఆడియెన్స్ లో ఆసక్తి ని కలిగించింది. ఈ సినిమా తాజాగా సెన్సార్  పూర్తి చేసుకుంది. అయితే సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి A సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా నెట్టింట్లో వార్త  స్ప్రెడ్ అవుతోంది. తెలుగు చిత్రాలకు A సర్టిఫికెట్ ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. A సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలకి 18 ఏళ్ళ లోపు వయసున్న వారికి ఎంట్రీ ఉండదు. ఇటీవల మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘రావణాసుర’ సినిమాకి కూడా సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీ చేసింది.
virupaksha-2తాజాగా ‘విరూపాక్ష’ సినిమాకి కూడా సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ రావడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఇది ఒక మంచి మిస్టరీ సినిమా అని, హారర్, థిల్లర్ అంశాలు కూడా ఉన్నాయి అని చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, విడుదల తేదీ దగ్గర పడటంతో హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ సంయుక్త మీనన్ మరియు చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తమ సినిమా కంటెంట్‌ పై యూనిట్ అంతా కూడా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.
సాయి తేజ్ యాక్సిడెంట్‌ నుండి కోలుకున్న అనంతరం వస్తున్న ఫస్ట్ సినిమా కావడంతో ఫ్యాన్స్ లో ‘విరూపాక్ష’ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అంతేకాకుండా సాయిధరమ్ కెరీర్‌కు కూడా ఈ చిత్రం హిట్ అవ్వడం ఎంతో అవసరం. ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌ పై నిర్మించారు. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ సమకూర్చారు. అజనీష్ లోక్‌నాథ్ ‘కాంతార’ చిత్రానికి కూడా సంగీతం సమకూర్చారు. మేకర్స్ ‘విరూపాక్ష’ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు.

Also Read: VIDUDALA PART-1 REVIEW : “విజయ్ సేతుపతి, సూరి” నటించిన విడుదల పార్ట్-1 ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like