శ్రీవారి సన్నిధిలో విశ్వక్ తన నెక్స్ట్ మూవీస్ టైటిల్స్ రివీల్

శ్రీవారి సన్నిధిలో విశ్వక్ తన నెక్స్ట్ మూవీస్ టైటిల్స్ రివీల్

by Anudeep

Ads

పాగల్ మూవీ హీరో విశ్వక్ తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నాడు. తన ప్రతీ సినిమా రిలీజ్ కు ముందు శ్రీ వారిని దర్శించుకోవడం సెంటిమెంట్ గా భావిస్తానన్న విశ్వక్ పాగల్ సినిమా రీలీజ్ కి ముందు ఉన్న హడావిడి వాళ్ళ అది జరగలేదని అందుకే సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయినా తర్వాత కాలినడకన కొండకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Video Advertisement

ఈ సందర్బంగా విశ్వక్ మాట్లాడుతూ పాగల్ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకు మరీ ముఖ్యంగా యూత్ కి ఆయున థాంక్స్ చెప్పారు. విశ్వక్ ను చూసిన ఆనందంలో భక్తులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అయితే ఈ సందర్భం లో ఆయన తన తదుపరి సినిమాల గురించి కూడా మాట్లాడారు. PVP మరియు దిల్ రాజు ల జాయింట్ వెంచర్ లో “హే భగవాన్ ” అనే వర్కింగ్ టైటిల్ తో ఒక మూవీ అలాగే “అశోక వనం లో అర్జున కళ్యాణం” అనే సినిమా లతో ముందుకు వస్తున్నట్లు విశ్వక్ చెప్పారు.

విజయవాడ, గుంటూరు, కర్నూల్ మరియు వైజాగ్ లలో ని పాగల్ సక్సెస్ టూర్ చేస్తున్నట్లు విశ్వక్ సేన్ తెలిపారు.


End of Article

You may also like