చైల్డ్ ఆర్టిస్ట్‌గా “విశ్వక్ సేన్” నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా.? ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే.?

చైల్డ్ ఆర్టిస్ట్‌గా “విశ్వక్ సేన్” నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా.? ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే.?

by Harika

Ads

విశ్వక్ సేన్ త్వరలోనే గామి సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. దాదాపు 4 ఏళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఎట్టకేలకు మార్చ్ 8న విడుదల అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విశ్వక్ సేన్ గామి సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు.

Video Advertisement

producers comments on vishwaksen behaviour

విశ్వక్ సేన్ వెళ్ళిపోమాకే అనే రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు కానీ 2018 లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాతో ఫేమస్ అయ్యాడు. అయితే నిజానికి వెళ్ళిపోమాకే సినిమా విశ్వక్ సేన్ మొదటి సినిమా కాదట అంతకుముందే వేరే సినిమా చేశానంటూ సీక్రెట్ రివీల్ చేశాడు. హైదరాబాదులో పుట్టి పెరిగిన విశ్వక్ సేన్ కు చిన్నప్పటినుంచి సినిమాలు అంటే విపరీతమైన పిచ్చి.

ఆ పిచ్చితోనే తొమ్మిదవ తరగతి చదివేటప్పుడు నుంచి ఆడిషన్స్ ఇచ్చేవాడిని. నాగచైతన్య డబ్ల్యూ మూవీ జోష్ లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కి విశ్వక్ ఆడిషన్ ఇస్తే మరీ చిన్నపిల్లాడి లాగా ఉన్నావని రిజెక్ట్ చేశారంట. అదే సమయంలో దాసరి నారాయణరావు గారి నిర్మాణంలో జగపతిబాబు హీరోగా బంగారు బాబు అని సినిమా తెరకెక్కుతోంది. ఆ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టులు కావాలంటే విశ్వక్ తన ఫోటోలు పంపించాడు. అనుకోకుండా బంగారు బాబు చిత్రంలో అతనికి అవకాశం వచ్చింది.

ఇందులో హీరో చిన్నప్పుడు అతనిని చెడగొట్టే బ్యాచ్ లో ఒకటిగా విశ్వక్ నటించాడు. మొదటి రెండు షార్ట్స్ లోని అతను కనిపిస్తాడు. అదే విశ్వక్ ఫస్ట్ సినిమా అలాగే ఈ సినిమా కోసం విశ్వక్ ఒకరోజు మాత్రమే పనిచేశాడు. అందుకు అతనికి 900 రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చాడంట. మొదటిసారిగా తన ఇంటికి కారు రావడం, అందులో తనని రామోజీ ఫిలిం సిటీకి తీసుకు వెళ్ళటం, రామోజీ ఫిలిం సిటీని అదే మొదటిసారి చూడటం అంటూ చాలా విషయాలను చాలా ఎగ్జైట్ అవుతూ చెప్పాడు విశ్వక్ సేన్.


End of Article

You may also like