ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగం రాలేదు…ఇప్పుడు పానీపూరి వ్యాపారంతో సక్సెస్ అయ్యారు.! రియల్ స్టోరీ!!

ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగం రాలేదు…ఇప్పుడు పానీపూరి వ్యాపారంతో సక్సెస్ అయ్యారు.! రియల్ స్టోరీ!!

by Mounika Singaluri

Ads

బీటెక్ వాలా పానీ పూరి అనే పేరుతో విశాఖపట్నంలో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన శ్రీ రామకృష్ణ తన విజయానికి సంబంధించిన సక్సెస్ స్టోరీ ని బి బి సి తో పంచుకున్నారు. ఉద్యోగం రాకా నిరాశ చెందే స్థాయి నుంచి పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడానికి అతను పడ్డ కష్టం గురించి వివరించారు.

Video Advertisement

అతని సక్సెస్ స్టోరీ అతని మాటల్లోనే తెలుసుకుందామా…దువ్వాడ విజ్ఞాన్ కళాశాలలో 2020 కి పూర్తి కావలసిన నా ఇంజనీరింగ్ కాస్త 2021 పూర్తయింది. కాగా 2020లో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఒక ఐటీ కంపెనీలో 18 వేల రూపాయల జీతానికి ఉద్యోగం వచ్చింది. కానీ సంవత్సరం పాటు ఎదురుచూసిన ఎటువంటి కాల్ లెటర్ రాలేదు. దీనికి కోవేట్ పరిస్థితులే కారణమని మా యాజమాన్యం చేతులు దులుపుకుంది.

పోనీ ఏదన్నా బిజినెస్ చేద్దామంటే మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. అనారోగ్యంతో బాధపడుతూ మా నాన్నగారు నేను బీటెక్ సెకండియర్ లో ఉండగానే కాలం చేశారు. ఈ పరిస్థితుల్లో తక్కువ బడ్జెట్లో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న ఆలోచన వచ్చింది. ఈ క్రమంలో నేను పూణేలో తిన్న పానీపూరి బండి గుర్తుకు వచ్చింది. మనకు అందుబాటులో ఉండే పానీపూరి స్టాల్స్ లా కాకుండా అది చాలా వెరైటీగా ఉండేది. అక్కడ ప్లేటులో ఐదు పానీపూరీలు ఇచ్చేవారు. ఒక్కో పూరిలో ఒక్కో టెస్ట్ తో ఉన్న వాటర్ వేసి ఇవ్వడం వల్ల అది చాలా వెరైటీగా అనిపించింది.

కానీ ప్రస్తుతం ఎక్కడ పట్టినా పానీపూరి స్టాల్స్ కనిపించే ఈ టైంలో ఈ బిజినెస్ క్లిక్ అవుతుందా అని చాలా రోజులు మా అమ్మ ,తమ్ముడు ,కజిన్‌తో చర్చించాను.  ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 650 రూపాయల పెట్టుబడి తో మొదలైన నా ఈ వ్యాపారం క్రమక్రమంగా పెరిగి ఇప్పుడు ఐదు స్టాల్స్ ఫ్రాంచసైజులు కూడా ఉన్నాయి. మొదటగా ప్రారంభించిన న్యూ కోలని స్టాల్ తో పాటు ఎన్ఏడీ జంక్షన్, శ్రీరామ టాకీస్ సెంటర్, మద్దిలపాలెం, ఎంవీపీ కోలనీలలో కూడా మా స్టాల్స్ పెట్టాం.

ప్రస్తుతం మేం పెట్టిన స్టాల్స్ అన్నీ కూడా రోజుకు పదివేల నుంచి 15 వేల వరకు బిజినెస్ చేస్తున్నాయి. రాబోయే కాలంలో మరిన్ని ప్రదేశాలలో మా బ్రాంచీలు ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తున్నాను” అని తన వ్యాపారానికి సంబంధించిన వివరాలను తెలియపరిచారు.
అంతేకాకుండా ఈ బిజినెస్ కుండా సంపాదించిన డబ్బుని దుబారా చేయకుండా పై చదువులు చదవాలి అన్న ఆశయంతో భద్రపరుస్తున్న ఈ యువ వ్యాపారవేత్తను అందరూ ప్రశంసిస్తున్నారు.

Article sourced from: bbc/telugu


End of Article

You may also like