రెండో పెళ్లి చేసుకోమని ఓ నెటిజెన్ అడిగితే.. ఆ నటుడి భార్య ఇచ్చిన షాకింగ్ రిప్లై చూడండి..!

రెండో పెళ్లి చేసుకోమని ఓ నెటిజెన్ అడిగితే.. ఆ నటుడి భార్య ఇచ్చిన షాకింగ్ రిప్లై చూడండి..!

by Anudeep

Ads

సాధారణం గానే సెలెబ్రిటీల లైఫ్ పై చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుంది. అలానే.. వారు చాలా సార్లు అభిమానుల మితి మీరిన అభిమానం కారణం గా ఇబ్బందుల్లో ఇరుక్కుంటూ ఉన్నారు. కొన్నిసార్లు అభిమానులు వేసే కొంటె ప్రశ్నలకు సైతం వారు తెలివిగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. వారు దురుసు గా సమాధానం చెపితే.. ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటారు కాబట్టి నెగటివిటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది.

Video Advertisement

vj anjanaa 2

ఇలాంటి పరిస్థితే, ఇటీవల ఓ ప్రముఖ తమిళ నటుడు భార్య ఎదుర్కోవాల్సి వచ్చింది. తమిళ నటుడు కాయల్ చంద్రన్ విభిన్నమైన పాత్రలను పోషిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. కాయల్ చంద్రన్ వీజే అంజనా ను ప్రేమించారు. 2015 లో ప్రేమ లో పడ్డ వీరు 2016 లో అంగ రంగ వైభవం గా వివాహం చేసుకున్నారు. ఇటీవల ఈ జంట ఐదవ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.

vj anjana

ఇటీవలే, వీజే అంజనా సోషల్ మీడియా లో తన ఖాతా ద్వారా తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సమయం లో బాలాజి అనే అభిమాని ఓ కొంటె ప్రపోజల్ తీసుకొచ్చాడు. తనను రెండో పెళ్లి చేసుకుంటారా? అంటూ ప్రపోజ్ చేసాడు. దీనికి, ఆమె కూడా ఫన్నీ గానే రిప్లై ఇచ్చారు. “ఈ ప్రపోజల్ గురించి మా ఆయనకీ చెప్పాను. అందుకు ఆయన కూడా ఒప్పుకుని బాలాజీ అడ్రస్ తెలుసుకో.. నిన్ను కొరియర్ లో ప్యాక్ చేసి పంపిస్తా.. అన్నారని తెలిపారు. నేను పెట్టె ఒత్తిడి తట్టుకోలేక..నన్ను పంపడానికి సిద్ధం అయిపోయారని..” ఆమె నవ్వుతు సమాధానమిచ్చారు.


End of Article

You may also like