ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా హిట్ అవ్వలేదు. భారీ ఎక్స్పెక్టేషన్స్ ప్రేక్షకులు పెట్టుకున్నా డిసప్పాయింట్ చేసింది. మరో పక్క డియర్ కామ్రేడ్ సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఇలా విజయ్ దేవరకొండ కి కాలం కలిసి రావడం లేదు.

Video Advertisement

భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పటికీ ఊహించిన ఫలితాలు ఈ సినిమాకి అందలేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఖుషి సినిమా షూటింగ్ కూడా అవుతోంది. ఇంచుమించు చాలా షూటింగ్ అయిపోయింది.

లైగర్ సినిమా హిట్ అవ్వకపోవడం తో సినిమాను కొనుగోలు చేసిన వాళ్లకి నష్టాలు వచ్చాయి. అలానే పూరి జగన్నాధ్ పైన విమ‌ర్శ‌లు కూడా వచ్చాయి. కానీ ఈ విమర్శలు వింటున్నా కూడా నిశబ్దం గానే ఉంటున్నాడు పూరి జగన్నాధ్. అయితే వి.వి.వినాయ‌క్ రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో పూరి జగన్నాథ్ పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ పై స్పందించారు.

ఇక దాని గురించి చూస్తే.. దర్శకుడు పూరి జగన్నాధ్ యొక్క సామర్ధ్యం ఎవరికీ తెలీదు. బ‌య‌ట‌కు వ‌చ్చే వార్త‌ల‌ను చూస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారని.. మాట్లాడుతున్నారని అన్నారు. అలానే ఈ చిత్రం పూరి జ‌గ‌న్నాథ్ లైఫ్ ని ఏమి మార్చేయదు. గతం లో కూడా ఫ్లాపులు, హిట్లు, సూపర్ హిట్లను కూడా పూరి అందుకున్నారు అని చెప్పారు వినాయక్.

అలానే ఇప్పటికీ పోకిరి సినిమా తనకి ఇష్టమని చెప్పాడు. మ‌ళ్లీ పోకిరితో కొడ్తే ఏ సినిమా కూడా కనపడదని చెప్పారు. పైగా సినిమాల్లో కష్టాలు వస్తాయని.. ఇవన్నీ సహజమని అన్నారు. మళ్లీ తిరిజి లేవ‌లేనంత అస‌మ‌ర్దుడేం కాదు పూరి అని చెప్పారు.

ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తున్నారు. అయితే సమంతకు కొన్ని సమస్యలు రావడం వల్ల షూటింగ్ మధ్యలో ఆగింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.