మెగాస్టార్ చిరంజీవి వరస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య పై మెగా అభిమానులకు ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ అయింది.

Video Advertisement

ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వాల్తేరు వీరయ్య సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

minus points in chiranjeevi waltair veerayya title teaser

ఈ సినిమాలో మాస్ మహారాజా రవి తేజ కూడా ముఖ్య పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ చిరు రవితేజ ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో చిరు గోదావరి యాస లో మాట్లాడుతున్నారు. ఈ సినిమాలో మాస్ కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండేటట్టు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త వచ్చింది. చిరంజీవి 154వ సినిమా అయినా వాల్తేర్ వీరయ్య లో రవితేజ కీలక పాత్ర ఉంది కనుక రవితేజ కి సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ చూస్తోంది.

ఇటు చిరంజీవి అభిమానులని అటు మాస్ మహారాజ రవితేజ అభిమానులను కూడా కుష్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. రవితేజ కి సంబంధించిన ఈ టీజర్ డిసెంబర్ రెండో వారం లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అలానే రవితేజ పై ఒక మాస్ సాంగ్ షూటింగ్ కూడా జరిగిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రవి తేజ ధమాకా సినిమా విడుదల కి సిద్ధంగా వుంది. డిసెంబర్ 23న ఈ సినిమా విడుదల అవుతుంది. అలానే రవి తేజ రావణాసుర, ఈగల్ సినిమాలలో నటిస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్ కూడా జరుగుతోంది. అంతే కాక టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా చేస్తున్నారు రవి తేజ. ఇలా వరుస సినిమాలతో బిజీ అయ్యిపోయారు.