Ads
తెలుగు సినిమా స్థాయిని పెంచిన వాళ్ళలో చిరంజీవి ఒకరు. ఒక సాధారణమైన కుటుంబం నుండి వచ్చి సహాయ పాత్రలతో తన కెరీర్ ని మొదలు పెట్టి, తర్వాత హీరోగా ఎన్నో సినిమాలను చేశారు. చిరంజీవి నుండి సుప్రీం హీరో చిరంజీవి వరకు మళ్లీ అక్కడి నుండి మెగాస్టార్ చిరంజీవి వరకు ఎదిగే క్రమంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. వరుసగా ఫ్లాపులు వచ్చినా కూడా తట్టుకొని తిరిగి మళ్లీ తనేంటో నిరూపించుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి.
Video Advertisement
అయితే మధ్యలో రాజకీయాల కోసం విరామం తీసుకున్నారు చిరు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. అయితే ఇటీవల వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం తో సూపర్ హిట్ అందుకున్నారు చిరు. సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ చిత్రం కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. తాజాగా ఈ చిత్రం నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. డైరెక్టర్ బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. రవి తేజ, శృతి హాసన్, కేథరిన్ కీలక పాత్రల్లో నటించారు. క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీకి ఆడియెన్స్ రెస్పాన్స్ భారీగా లభించింది.
రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో రూ. 114.64 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.15 కోట్లు, ఓవర్సీస్లో రూ. 13.25 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 26 రోజుల్లో చిరంజీవి సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 136.04 కోట్లు షేర్, రూ. 232.40 కోట్లు గ్రాస్ వచ్చింది. చిరంజీవి – బాబీ కలయికలో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 89 కోట్లుగా నమోదైంది.
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 47.15 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని మెగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే తెలుగులో అత్యధిక లాభాలను అందుకున్న చిత్రాల జాబితాలో రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీ రికార్డు (రూ. 47.52)కు కూడా చిరంజీవి సినిమా చేరువగా వచ్చేసింది.
End of Article