చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. మాస్ లుక్ లో చిరంజీవి వస్తే సినిమా హిట్ ఏ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సంక్రాంతి కి మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో రాబోతున్నారు.

Video Advertisement

ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి లుక్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. దీనితో సినిమా హిట్టే అని అభిప్రాయపడుతున్నారు.

waltair veerayya censor talk..

మెగా స్టార్ చిరంజీవి మాస్ మహా రాజ రవి తేజ తో కలిసి మాస్ జాతర చేయడానికి సిద్ధమైపోయారు. ఏదేమైనా ఈ సినిమా అందర్నీ ఆకట్టేసుకుంటుందనే టాక్ నడుస్తోంది. బాబి వాల్తేరు వీరయ్య సినిమా కి దర్శకత్వం వహిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన ఈ సినిమా లో అందాల తార శృతిహాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా లో డాన్స్ ఎనర్జీ పక్కా ఎంటర్టైన్ చేస్తాయి. ఈ సినిమా లో ఇప్పటి వరకు వచ్చిన పాటలు కూడా అందర్నీ మెప్పించాయి.

waltair veerayya censor talk..

ఇటు చిరంజీవి ఫ్యాన్స్ అటు మాస్ మహారాజు రవి తేజ ఫాన్స్ ఇరువురూ కూడా సినిమా కోసం ఎంతో ఆసక్తి తో చేస్తున్నారు చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి రవి తేజ కలిసి సినిమా లో నటిస్తూ ఉండడం వలన ఇరు ఫాన్స్ కి ఇది పండగే. వీరయ్య పాత్ర లో మరి చిరంజీవి ఎలా మెప్పిస్తారో చూడాలి. పైగా చిరు గోదారి యాస లో ఈ సినిమా లో మాట్లాడుతున్నారు. ఈ సినిమా లో చిరు తండ్రిగా సత్య రాజ్ నటిస్తున్నారు విలన్ గా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఈ సినిమా ట్రైలర్ వచ్చేసింది. మరి మీరు కూడా ఈ ట్రైలర్ ని చూసేయండి. సినిమా కోసం మాత్రం ఇంకొన్ని రోజుల దాకా ఆగాల్సిందే.