“ఇదేం సెంటిమెంట్..? ఇప్పుడు వాల్తేరు వీరయ్య కూడా..?” అంటూ… మెగాస్టార్ “చిరంజీవి” వాల్తేరు వీరయ్య సినిమాపై కామెంట్స్..!

“ఇదేం సెంటిమెంట్..? ఇప్పుడు వాల్తేరు వీరయ్య కూడా..?” అంటూ… మెగాస్టార్ “చిరంజీవి” వాల్తేరు వీరయ్య సినిమాపై కామెంట్స్..!

by kavitha

Ads

స్టార్ హీరోల అభిమానులకు సాధారణంగా వారి హీరోల మూవీస్ విషయంలో కొన్ని సెంటిమెంట్స్ కలవర పెడుతుంటాయి. ఇప్పుడు ఇలాంటి సెంటిమెంటే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ అభిమానులను  భయపెడుతోందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.

Video Advertisement

అయితే ఆ సెంటిమెంట్ ఏమిటి, మెగా ఫ్యాన్స్ ‘వాల్తేరు వీరయ్య’ గురించి ఎందుకు ఆందోళన  చెందుతున్నారనేది చూద్దాం. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలోమెగాస్టార్ చిరంజీవి,శృతి హాసన్ జంటగా వస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే టైటిల్ టీజర్‌కి, ఇటీవలే విడుదలైన ‘బాస్ పార్టీ’ సాంగ్ కి  మంచి రెస్పాన్స్ వచ్చాయి. దాంతో ఈ సినిమా పై అంచనాలు ఇంకా పెరిగాయి. కాగా  ఈ సినిమా ఫలితం మీద  ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.

ఎందుకంటే ‘ఆచార్య’లో చిరంజీవి  హీరోగా నటించగా, రామ్ చరణ్ ముఖ్యపాత్రలో నటించాడు. ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ‘లూసిఫర్’ రీమేక్ గా వచ్చిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటించాడు. గాడ్ ఫాదర్ కి పాజిటివ్ టాక్ వచ్చి, వసూళ్లు కూడా బాగానే ఉన్నా, ఫలితం మాత్రం హిట్ అయితే కాలేదు. రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ నటించిన ఈ  సినిమాలూ నిరాశపరిచాయి.దీంతో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుందో అని మెగా ఫ్యాన్స్ కలవర  పడుతున్నారు.

అమితాబ్ బచ్చన్ వీరాభిమాని అయిన రవితేజ సినిమాల్లోకి రావడానికి, కష్టపడి ఈ స్థాయికి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవే కారణం అని  ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. రవితేజ ఇంతకు ముందు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ‘అన్నయ్య’ సినిమాలో  మెగాస్టార్ తమ్ముడిగా నటించాడు. 20 సంవత్సరాల తర్వాత మళ్లీ చిరంజీవితో కలిసి నటిస్తున్నాడు. ఈ సినిమాలో కథను మలుపు తిప్పే ముఖ్యమైన పాత్రలో రవితేజ కనిపిస్తాడని తెలుస్తోంది.


End of Article

You may also like