Ads
సుడిగాలి సుధీర్.. ఆ పేరుకున్న క్రేజే వేరు. సామాన్యంగా హీరోలకు అభిమానులుంటారు. కానీ ఓ బుల్లి తెర ఆర్టిస్ట్‌కి ఇంత మంది అభిమానులుండటం చాలా రేర్. బ్యాగ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి పైకి వచ్చిన సుధీర్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిన్న.. చిన్న మ్యాజిక్‌లు చేసే సుధీర్.. జబర్దస్త్ షోతో స్టార్‌గా అవతరించాడు.
Video Advertisement
ఆ తర్వాతి కాలంలో సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశాడు. పాపులారిటీ పెరగడంతో హీరోగానూ ఫేట్ టెస్ట్ చేసుకున్నాడు. అయితే మొదట అపజయాలే ఎదురయ్యాయి. గాలోడు చిత్రంలో ఓ మీడియం హిట్ అందుకున్నాడు. దీంతో ఆచితూచి అడుగులు వేస్తున్న సుధీర్.. తన నాలుగవ సినిమాను ఇటీవలే లాంచ్ చేశాడు.
సుధీర్ కి సోషల్ మీడియా లో మిలియన్ల సంఖ్య లో అభిమానులు ఉన్నారు. అతడిని ఇన్ స్టాలో 1.4 మిలియన్ల మంది ఫాలో అవతున్నారు. కానీ సుధీర్ మాత్రం కేవలం ఒక్కరినే ఫాలో అవుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో గెస్ చెయ్యగలరా..?? అదెవరో కాదండి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. చిరును స్పూర్తిగా తీసుకుని ఎంతో మంది.. ఇండస్ట్రీకి వచ్చారు. రకరకాల క్రాఫ్ట్స్‌లో సత్తా చాటుతున్నారు. అలానే సుధీర్‌కు చిరూనే ఇన్‌స్పిరేషన్. ఇదే విషయాన్ని పలు వేదికలపై కూడా చెప్పుకొచ్చాడు సుధీర్.
చిరంజీవి ని ఆదర్శంగా తీసుకొని ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అతడి తత్వమే ఇంతటి అభిమానానికి కారణం. ప్రస్తుతం యాంకర్‌గా, కంటెస్టెంట్‌గా, హీరోగా రాణిస్తున్నాడు సుధీర్. ఇక సుధీర్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన తన సినిమాకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ప్రస్తుతం సుధీర్ ‘పాగల్’ మూవీ తీసిన దర్శకుడు నరేష్ కుప్పిలి డైరక్షన్‌లో ‘GOAT- గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్’ అనే సినిమా చేస్తున్నాడు. సుధీర్ కు వరుస సినిమా అవకాశాలు రావడంతో సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంటూ బుల్లితెర కార్యక్రమాలకు దూరమవుతున్నారు.
Also read: యూట్యూబ్ స్టార్స్ “షాపింగ్” నిజమేనా..?? అసలు కథ ఇదే..!!
End of Article