వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న భార్యాభర్తలను వేగంగా వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు నాయిని ఐలయ్య (65) వెంకటమ్మ (55) ఇద్దరూ అక్కడిక్కడికే మృతిచెందారు. ఈ ప్రమాదం జిల్లాల్లోని రాంపూర్ హైవేపై శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అయితే వారిని ఢీకొట్టిన వాహనం ఎవరిది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది.

Video Advertisement