“మంగ‌మ్మ గారి మ‌న‌వ‌డు” సినిమా టైంలో బాలయ్యబాబు కు ఎన్టీఆర్ పెట్టిన ఈ 3 కండిషన్స్ ఏంటో తెలుసా?

“మంగ‌మ్మ గారి మ‌న‌వ‌డు” సినిమా టైంలో బాలయ్యబాబు కు ఎన్టీఆర్ పెట్టిన ఈ 3 కండిషన్స్ ఏంటో తెలుసా?

by Mounika Singaluri

Ads

నందమూరి బాలకృష్ణ హీరో గా వచ్చిన సినిమా “మంగమ్మ గారి మనవడు”. ఈ సినిమా అప్పట్లో బాగానే ఆడింది. మంచి పేరు తెచ్చుకుంది.

Video Advertisement

ఈ సినిమాలో బాలకృష్ణ హీరో గా నటించగా.. అలనాటి హీరోయిన్ భానుమతి గారు మంగమ్మ పాత్రను పోషించారు. ఆ పాత్రకి ఆమె నిజం గానే ప్రాణం పోశారు. ఆమె తప్ప మరెవ్వరిని ఆ పాత్రలో ప్రేక్షకులు ఉహించుకోలేనంత గా నటించి మెప్పించారు.

mangamma gaari manavadu 2

నిజానికి ఇది ఒక రీమేక్ సినిమా. మ‌న్ మాస‌నై అనే తమిళ సినిమా ను తెలుగు లో “మంగమ్మ గారి మనవడు” గా రీమేక్ చేసారు. ఈ సినిమాలో మంగమ్మ పాత్రలో భానుమతి గారే నటించాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారు. ఆమె ఒప్పుకుంటేనే ఈ సినిమా తీయాలని.. లేకుంటే.. ఈ సినిమా నే తీయొద్దంటూ ముందే చెప్పేసారు. ఆ తరువాత ఆయనే స్వయం గా భానుమతి గారికి ఫోన్ చేసి విషయం అడిగారు.

mangamma gaari manavadu 2

ఎన్టీఆర్ గారు చెప్పడం తో భానుమతి గారు కూడా ఈ సినిమాలో మంగమ్మ పాత్ర లో నటించడానికి ఒప్పుకున్నారట. ఐతే.. ఈ సినిమా ప్రారంభం కావడానికే ముందే బాలకృష్ణకు ఎన్టీఆర్ గారు మూడు షరతులు విధించారట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

#1. భానుమతిగారు షూటింగ్ స్పాట్ కి వచ్చే టైం కంటే అరగంట ముందే బాలకృష్ణ గారు షూటింగ్ లో ఉండాలట..
#2. ఆమె కార్ రాగానే డోర్ బాలకృష్ణ గారే తియ్యాలి.
#3. ఇక ఆవిడ కారులో నుండి  బయటకు దిగగానే.. కాళ్లకు నమస్కరించాలి.

mangamma gaari manavadu 1

ఇవన్నీ జరిగేటట్లు అయితేనే.. ఈ సినిమా షూటింగ్ నడుస్తుందని ఎన్టీఆర్ ముందే వార్నింగ్ ఇచ్చారట. బాలకృష్ణ కూడా తండ్రి విధించిన ఈ షరతులన్నటికి ఒప్పుకుని.. ఈ సినిమాలో నటించారు. అంతేకాదు షూటింగ్ జరిగినన్ని రోజులు ఆయన తండ్రి చెప్పినట్లే నడుచుకున్నారు.


End of Article

You may also like