ప్రముఖ సింగర్ వాణీ జయరాం ఇవాళ చనిపోయినట్టు ప్రకటించారు. వాణి జయరాం తెలుగు తో పాటు ఇంకా చాలా భాషల్లో పాటలు పాడారు. వాణీ జయరాం మృతి చాలా మందిని షాక్ కి గురి చేసింది. అయితే వాణీ జయరాం చనిపోయే ముందు జరిగిన కొన్ని సంఘటనలు చాలా అనుమానాలని కలిగిస్తున్నాయి. వాణీ జయరాం చనిపోయేముందు ఆవిడ ముఖం మీద చాలా గాయాలు ఉన్నాయి అని చెప్తున్నారు.
Video Advertisement
పని మనిషి చెప్పిన వివరాల ప్రకారం ఆమె మృతిని అనుమానాస్పద మృతిగా పరిగణలోకి తీసుకున్నారు. ఆమె ఇంటి సీసీటీవీ ని పరిశీలించిన తర్వాత కొన్ని విషయాలు కూడా బయటికి వచ్చాయి అని అంటున్నారు.
ఉదయం 11 గంటలకు వాణీ జయరాం ఎంత సేపు డోర్ కొట్టినా కూడా తీయలేదు. దాంతో ఆమె పని మనిషి చెన్నైలోని మైలాపూర్ లో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తర్వాత కొంచెం సేపటికి బంధువులు వచ్చి డోర్ పగలగొట్టి చూసారు. అప్పుడు వాణీ జయరాం గాయాలతో టేబుల్ మీద ఉన్నారు అని చెప్పారు. వాణీ జయరాం ముఖం మీద చాలా గాయాలు ఉన్నాయి. నుదుటి మీద కూడా ఎవరు కొట్టినట్లుగా గాయాలు ఉన్నాయి. వారు చూసే వాణీ జయరాం స్పృహలో లేరు.
ఈ సంఘటన జరిగిన సమయంలో వాణీ జయరాం తో పాటు ఇంట్లో ఎవరూ లేరు. ఆమెను చూసిన బంధువులు తర్వాత ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ వాణీ జయరాం చివరి శ్వాస విడిచారు. వాణీ జయరాం మృతి పట్ల ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు అసలు ఏం జరిగింది అనేది పరిశీలిస్తున్నారు. ఎంతో మంది ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా వాణీ జయరాంకి నివాళి అర్పించారు. భారతదేశం ఒక గొప్ప గాయని ని కోల్పోయింది అని అంటున్నారు.