అక్కినేని నాగార్జునకు ఏమైంది? ఆ ఈవెంట్ లో అలా కనిపించారు ఏంటి?

అక్కినేని నాగార్జునకు ఏమైంది? ఆ ఈవెంట్ లో అలా కనిపించారు ఏంటి?

by Anudeep

Ads

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు తెలుగు నాట ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలు, బిగ్ బాస్ రియాలిటీ షో హోస్టింగ్ తో బిజీ బిజీ గా ఉండే నాగార్జున గతేడాది బంగార్రాజు సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు.

Video Advertisement

అయితే.. తాజాగా జయమ్మ పంచాయితీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన కూడా భాగం అయ్యారు. ఈ సినిమాలో తెలుగు యాంకర్ సుమ లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఈవెంట్ కు నాగార్జున గెస్ట్ గా హాజరు అయ్యారు.

akkineni 2

అయితే ఈ ఈవెంట్ కు హాజరు అయిన నాగార్జున ఫ్యాన్స్ ఆయనను చూసి షాక్ అయ్యారు. అక్కినేని నాగార్జునకు ఏమైంది అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేసేస్తున్నారు. ఏ షో అయినా.. ఈవెంట్ లో అయినా ఈ వయసులో కూడా మన్మధుడిలా కనిపించే నాగార్జున “జయమ్మ పంచాయితీ” ఈవెంట్ లో మాత్రం డల్ గా కనిపించేసరికి అక్కినేని అభిమానులు సైతం షాక్ అయ్యారు.

akkineni 1

గతంలో ఆయనలో ఉన్న జోష్, ఎనర్జీ నిన్న ఈవెంట్ లో కనిపించకపోయేసరికి ఆయనకు ఏమైందో అంటూ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. వయసు మీద పడడం వల్లనే అలా కనిపిస్తున్నారని కొందరు చెబుతుండగా.. మరికొందరు కొడుకుల భవిష్యత్ గురించి బెంగ పెట్టుకోవడం వల్లనే అలా అయిపోయారని కామెంట్స్ చేస్తున్నారు. గతేడాది, చైతు సమంతలు విడాకులు తీసుకోవడం, అఖిల్ కెరీర్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నాగార్జున టెన్షన్ పడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అఖిల్  హీరోగా ఏజెంట్ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.


End of Article

You may also like