సాధారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోలతో పాటు ఇతర ఇండస్ట్రీల హీరోలకి కూడా చాలా క్రేజ్ ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా తమిళ్ ఇండస్ట్రీకి చెందిన హీరోలకి తెలుగు ఇండస్ట్రీలో దాదాపు చాలా మంది తెలుగు హీరోలకి సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.

Video Advertisement

మరి డబ్బింగ్ సినిమాలకు కూడా ఒక డైరెక్ట్ తెలుగు సినిమాకి ఉన్నంత రెస్పాన్స్ ఉంటుంది. అలా ఎన్నో సంవత్సరాల నుండి తన సినిమాలని తెలుగులో డబ్ చేస్తూ దాదాపు తెలుగు స్టార్ హీరోకి ఉన్న అంత క్రేజ్ సంపాదించుకున్న హీరో అజిత్ కుమార్.

why ajith is not attending movie pramotions..!!

అజిత్ హీరోగా నటించిన తెగింపు సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా కూడా అజిత్ ఒక మంచి ప్రయోగం చేశారు అని చాలా మంది అన్నారు. ఇప్పుడు అజిత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలకి సంబంధించి ఏ విషయాలు కూడా ఇంకా బయటికి రావట్లేదు. అజిత్ సోషల్ మీడియాలో లేరు. ఇంటర్వ్యూలు కూడా పెద్దగా ఇవ్వరు. సినిమా కంటెంట్ బాగుంటే అదే పెద్ద ప్రమోషన్ అని చాలా సార్లు అన్నారు.

why ajith is not attending movie pramotions..!!

దాంతో అజిత్ ఎప్పుడు ఎక్కడ ఉన్నారు అనే విషయం తన అభిమానులకి కూడా పెద్దగా తెలియదు. అజిత్ ప్రతి సినిమాకి ఒక కొత్త గెటప్ లో కనిపిస్తూ ఉంటారు. ఇటీవల తెగింపు సినిమాలో తెల్లటి గడ్డంతో డిఫరెంట్ స్టైల్ లో కనిపించారు. అజిత్ చాలా స్టైలిష్ గా ఉన్నారు అని చాలా మంది అన్నారు. అయితే అజిత్ ఇటీవల తన భార్య షాలినితో కలిసి వెకేషన్ లో వెళ్లిన ఫొటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఫోటోలు చూసిన చాలా మంది, “అజిత్ ఏంటి ఇలా అయిపోయారు?” అని కామెంట్స్ చేస్తున్నారు.

what happened to hero ajith kumar

కొంత మంది అయితే, “సడన్ గా చూస్తే విజయ్ మాల్యా లాగా ఉన్నారు” అని అంటున్నారు. ఏదేమైనా కూడా ఇవి అన్ని ఫొటోస్ కాబట్టి తీసే విధానంలో కూడా ఉంటుంది అని అంటున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. ఇంక సినిమాల విషయానికి వస్తే అజిత్ మగిళ్ తిరుమేని అనే దర్శకుడితో సినిమా చేయబోతున్నారు అని ఇటీవల ప్రకటించారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది అన్న విషయాలు ఏవి ప్రస్తుతం అయితే ఇంకా బయటికి రాలేదు. ఇది కాకుండా అజిత్ మరికొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి.