ఇలియానా ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి. కానీ ఇప్పుడు ఇలియానాను చూసిన అభిమానులు ఇలియానాకి ఏమైంది, ఇలా అయిపోయిందేంటి అని అనుకుంటున్నారు. పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది ఇలియానా. ఇలియానా దేవదాసు సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది.

Video Advertisement

ఆ తరువాత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ లాంటి స్టార్లతో నటించి, హిట్లు కొట్టింది. నిజం చెప్పాలంటే చాలా తక్కువ టైమ్ లోనే తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ అయ్యింది.

టాలీవుడ్ లో అదిరిపోయే హిట్స్ వచ్చాయి. ఇలియానా చాలా కాలం పాటు ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో కొనసాగింది. అంతేకాకుండా తెలుగులో కోటి రూపాయలు అందుకున్న తొలి హీరోయిన్‌గా ఇలియానా రికార్డ్ సృష్టించింది. సినిమాల్లో ఒక దశాబ్దం ఏలేసింది. హీరో తరుణ్ నటించిన భలే దొంగలు సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకుంది.

జల్సా, కిక్, జులాయి వరుస హిట్లతో స్టార్ హీరోయిన్‌గా ఉన్న టైమ్ లోనే బర్ఫీ సినిమాతో బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడికి వెళ్ళాక ఈ గోవా బ్యూటీకి అనుకున్నంత సక్సెస్ అక్కడ రాలేదు. ఇక ఆ తరువాత తెలుగు, హిందీ సినిమాలకు కొద్దికాలం దూరంగా ఉంది. ఇలియానా తర్వాత తెలుగులో రవితేజతో దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చింది.

what happened to ileana now

 

ఇలియానా బొద్దుగా మారడంతో ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఆమె శరీరాకృతి చాలా మారిపోయింది. ఆమధ్య పూర్తిగా షేప్ అవుట్ అయిపోయిందంటూ విమర్శలు కూడా వచ్చాయి. ఆమె ఫిజిక్‌ పై అస్సలు దృష్టి పెట్టడం లేదని ఆమె భిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేసారు. అయితే తాజాగా బయటికి వచ్చిన ఫోటో చూస్తుంటే అందులో మరి సన్నగా అయిపోయి, అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. దీంతో అసలు ఆమెకు ఏమైందని సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు. ఇంకోదరు మిమ్స్ కూడా పెడుతున్నారు.