Ads
సినిమా వాళ్ళ జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సినిమా ప్రియులకు తమ బంధువుల వార్తలు తెలిసిన తెలియకపోయినా సెలబ్రిటీల గురించి మాత్రం ప్రతి చిన్న విషయం ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. వాళ్లతో మనకి పరిచయం లేకపోయినా మన వాళ్లే అంత చనువు వస్తుంది. వారికి ఏమైనా జరిగిందంటే ఇక అభిమానుల కంగారు మాములుగా ఉండదు.
Video Advertisement
అఖండ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య బాబు “అన్ స్టాప్పబుల్ ” షో తో ఆ జోష్ ని కొనసాగించారు. అయితే.. ఈ జోష్ లోనే గోపీచంద్ మలినేనితో మరో సినిమాను కూడా ప్రారంభించేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇటీవల బాలకృష్ణ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. దీనితో అభిమానులలో కంగారు మొదలైంది. బాలయ్యకు ఏమైంది అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. బాలయ్య బాబుకి గత కొంతకాలంగా మోకాళ్ళలో నొప్పులు వస్తున్నాయి. ఇందుకోసమే ఆపరేషన్ చేసారు అంటూ చర్చ నడుస్తోంది. కానీ, ఈ విషయమై క్లారిటీ వచ్చింది. బాలకృష్ణ జనరల్ చెక్ అప్ కోసమే ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయనను చెక్ చేసి మోకాలికి పట్టీ వేశారని, ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగా ఫుల్ జోష్లో ఉన్నారని తెలిపారు. మరో వైపు బాలయ్య అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
End of Article