“నీ స్నేహం” లో ఉదయ్ కిరణ్ తో పాటు నటించిన “జతిన్” గుర్తున్నారా..? ఇప్పుడెలా ఉన్నారో తెలుసా..?

“నీ స్నేహం” లో ఉదయ్ కిరణ్ తో పాటు నటించిన “జతిన్” గుర్తున్నారా..? ఇప్పుడెలా ఉన్నారో తెలుసా..?

by Anudeep

Ads

పరుచూరి మురళి దర్శకత్వంలో, సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎమ్.ఎస్.రాజు నిర్మించిన చిత్రం ‘నీ స్నేహం’. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘నీ స్నేహం’ లో ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించగా.. ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్, హీరోయిన్ తాత పాత్రలో నటించారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య 2002 నవంబర్ 1న విడుదల అయింది. మొదటి రోజు ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఆ తర్వాత క్రమక్రమంగా కలెక్షన్లు తగ్గాయి. దాంతో ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.

Video Advertisement

స్నేహం, ప్రేమ అనే రెండు విడదీయలేని ఈ బంధాల్నే కథాంశంగా రూపొందిన రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ యూత్‌కి బాగా నచ్చింది.. ఉదయ్ తన నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో జీవించేశాడు. ఆర్.పి. పట్నాయక్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎస్సెట్.. సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటాయి.. ఈ మూవీలోని పాటలన్నిటినీ సిరివెన్నెల రాయడం విశేషం. ఈ చిత్రం లో ప్రతి పాట సూపర్ హిట్ అయ్యింది. అప్పట్లో ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపించేవి. తాజాగా ఈ చిత్రం విడుదల అయ్యి ఇరవై ఏళ్ళు పూర్తి అయ్యింది.

did you remember this hero from nee sneham movie..

ఈ చిత్రం లో ఉదయ్ స్నేహితుడిగా జతిన్ కనిపించాడు. అతడు హిందీ నటుడు కావడంతో.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోవడంతో సినిమాకు మైనస్ అయింది. ముంబై లో పుట్టిన జతిన్ మొదట మోడల్ గా పని చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు ప్రైవేట్ ఆల్బమ్స్, హిందీ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. టీవీ కార్యక్రమాల్లో కూడా ఆయన నటించారు.

did you remember this hero from nee sneham movie..

హిందీ తో పాటు పలు పంజాబీ చిత్రాల్లో కూడా ఆయన నటించారు. ఇక హిందీ లో కొన్ని చిత్రాలు చేసిన జతిన్.. తెలుగులో నీ స్నేహం చిత్రం తర్వాత మరో చిత్రం లో కనిపించలేదు. ఆయన ప్రస్తుతం అమెరికా లోని, కాలిఫోర్నియా లో జీవిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. కరోలినా గ్రేవాల్ అనే విదేశీ మహిళని 2010 లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకి ఇద్దరు బిడ్డలు.


End of Article

You may also like