నటి శ్రియ భర్తకి ఏమైంది..? ఆండ్రీ కొశ్చివ్‌ హాస్పిటల్ లో ఇలా ఎందుకు ఉన్నారు..?

నటి శ్రియ భర్తకి ఏమైంది..? ఆండ్రీ కొశ్చివ్‌ హాస్పిటల్ లో ఇలా ఎందుకు ఉన్నారు..?

by Anudeep

Ads

టాలీవుడ్ నటి శ్రియ శరణ్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె భర్త హాస్పిటల్ దుస్తులలో ఉన్నారు. చేతికి బ్యాండేజ్ లు ఉన్నాయి. దీనితో ఈ ఫోటోలను చూసిన అభిమానులంతా కంగారు పడుతున్నారు. శ్రియ భర్తకి ఏమైంది అంటూ సందేహం వెలిబుచ్చుతున్నారు.

Video Advertisement

చాలా కాలం వరకు నటి శ్రియ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన సంగతి తెలిసిందే. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన ఆమె నటించారు.

shriya 1

ప్రస్తుతం కూడా ఆమె పలు కీలక పాత్రలను, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుని తెలుగు ప్రేక్షకులని అలరిస్తూనే ఉన్నారు. సినిమాలే కాకుండా.. ఆమె సోషల్ మీడియాలో కూడా ఎంతో ఆక్టివ్ గా ఉంటారు. ఫారినర్ ఆండ్రీ కొశ్చివ్‌ ను పెళ్లి చేసుకున్న శ్రియ ఒక పాపకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాపకి ఏడాది నిండే వరకు శ్రియ తనకి ఓ కూతురు ఉందన్న సంగతి కూడా బయటకి తెలియనివ్వలేదు.

shriya 2

ఇది ఇలా ఉంటె.. తాజాగా శ్రియ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు అందరిని ఆశ్చర్యంలో పడేశాయి. ఆమె భర్త హాస్పిటల్ లో ఉండగా వారు తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. దీనితో.. ఆమె భర్తకి ఏమైందో అన్న కంగారు మొదలైంది. ఆమె భర్త “హెర్నియా” తో బాధపడుతున్నారట. ఇటీవలే అపోలో యాజమాన్యం ఆయనకు సర్జరీ చేసి చికిత్స అందించారట. అందుకని.. ఆమె సోషల్ మీడియా మాధ్యమం ద్వారా వారికి ధన్యవాదాలు తెలిపింది. అపోలో హాస్పిటల్ డాక్టర్ రజనీస్ రెడ్డి గారికి… అలాగే ఈ విషయంలో సాయం చేసినందుకు ఉపాసన కొణిదెలకు కూడా శ్రియ ధనువాదాలు చెప్పుకుంది.

https://www.instagram.com/p/CajIsALsrtw/


End of Article

You may also like