అవార్డ్ విన్నింగ్ సింగర్… కానీ ఇప్పుడు అంతా తలకిందులు అయిపోయింది..! ఈమె పరిస్థితి ఇలా ఎందుకు అయ్యింది..?

అవార్డ్ విన్నింగ్ సింగర్… కానీ ఇప్పుడు అంతా తలకిందులు అయిపోయింది..! ఈమె పరిస్థితి ఇలా ఎందుకు అయ్యింది..?

by Harika

Ads

ఒక మనిషి జీవితంలో ఎంత కష్టపడినా, ఎంత డబ్బు సంపాదించినా, ఆరోగ్యం మాత్రం సరిగ్గా ఉండడం చాలా ముఖ్యమైన విషయం. ఆరోగ్యం అంటే కేవలం మనల్ని మనం కాపాడుకోవడం మాత్రమే కాదు. మనం మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం. మనిషి తన జీవితంలో ఎంతో ఒత్తిడికి గురవుతాడు. కొంత మంది ఇలాంటి ఒత్తిడిని ఎక్కువగా తీసుకుంటారు. అలాంటప్పుడు వారికి మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి. కొంత మంది ఒక సమయం తర్వాత ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థం అవ్వదు. చుట్టూ ఉన్న మనుషులు, వారికి జరిగిన సంఘటనల వల్ల వారిలో ఈ మార్పు వస్తుంది. సింగర్ సుచిత్ర పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది అని అంటున్నారు. గతంలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ సుచిత్ర పాడారు.

Video Advertisement

what happened to singer suchitra

తెలుగులో బిజినెస్ మాన్ సినిమాలో సార్ వస్తారా పాట సుచిత్రకి చాలా పాపులారిటీ తీసుకొచ్చింది. పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు పాట పాడింది కూడా సుచిత్ర. సుచిత్ర కొంత కాలం క్రితం తన దగ్గర సెలబ్రిటీల వ్యక్తిగత ఫోటోలు ఉన్నాయి అంటూ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పటి నుండి సుచిత్ర కి సింగర్ గా అవకాశాలు తగ్గడం మొదలు అయ్యాయి. సుచిత్ర భర్త కార్తీక్ కూడా, “సుచిత్ర మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదు” అని, అందుకే తను అలా మాట్లాడుతున్నారు అని చెప్పారు. ఆ తర్వాత ఆర్జేగా సుచిత్ర చేశారు. దాంతో మళ్లీ సుచిత్ర ఈ విధంగా అయినా ప్రేక్షకులని పలకరిస్తూ ఉంటారు అని అనుకున్నారు. ఇటీవల సుచిత్ర ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ చర్చనీయాంశంగా మారింది.

అందులో ధనుష్ జీవితంలోని కొన్ని విషయాల గురించి మాట్లాడారు. ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ గత 14 సంవత్సరాల నుండి గొడవల్లో ఉన్నారు అని చెప్పారు. ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారు అని అన్నారు. సుచిత్ర భర్త కార్తీక్, ధనుష్ తో ప్రేమలో ఉన్నారు అని అన్నారు. హీరో విజయ్ బయటకు కనిపించే అంత మంచి వ్యక్తి కాదు అని కూడా చెప్పారు. త్రిష, విజయ్ ఎలా చెప్తే అలా ఆడతారు అని అన్నారు. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది వ్యక్తుల మీద ఏదో ఒక రకంగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. “సింగర్ శ్రేయ ఘోషల్ గొంతు అంత మంచి గొంతు ఏం కాదు” అని, ఆమె గొంతులో ఏం ఉండదు అని అన్నారు. ఎన్నో పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే అందరూ బాధపడుతున్నారు. సుచిత్రని చూస్తూ ఉంటే మొహం పీక్కుపోయినట్టుగా అయిపోయి, చాలా డల్ గా అనిపిస్తున్నారు.

ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అనే విషయం ఆమె ఇంటర్వ్యూలు చూస్తుంటేనే తెలుస్తోంది. అయితే ఇది ఒక ఇంటర్వ్యూ తో ఆగలేదు. ఆమె ఇంటర్వ్యూ చాలా ఫేమస్ అవడంతో, తర్వాత మరి కొంత మంది ఆమె ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. “ఆమె మాట్లాడే మాటల్లో ఎంత నిజం ఉందో తెలియదు. ఒకవేళ ఉన్నా కూడా అవి సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు. వాటితో ప్రేక్షకులకు పని లేదు. కాబట్టి ఆమె అవన్నీ కూడా చెప్పడం తప్పు” అని అందరూ అంటున్నారు. అసలు ఆమె ఇలాంటి విషయాలు మాట్లాడడానికి ఇంటర్వ్యూలు తీసుకోవడం కరెక్ట్ కాదు ఏమో అని తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.


End of Article

You may also like