వీళ్ళ విషయంలో కూడా జరిగింది అదే కదా..? మరి అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు..?

వీళ్ళ విషయంలో కూడా జరిగింది అదే కదా..? మరి అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు..?

by Mohana Priya

Ads

రోజా మీద ఇటీవల బండారు సత్యనారాయణమూర్తి కామెంట్స్ చేయడం, దానిపై ఎంతో మంది సినీ ప్రముఖులు స్పందించడం తెలిసిందే. కొంత మంది హీరోయిన్లు రోజాని ఇలాంటి మాటలు అనడం సరికాదు అని అన్నారు.

Video Advertisement

ఈ విషయం మీద బండారు సత్యనారాయణ క్షమాపణ కూడా చెప్పాలి అని అన్నారు. ఆయన మాట్లాడిన మాటలు, వాడిన పదాలు సరిగ్గా లేవు అని, ఒక మహిళను అవమానపరిచేలా ఉన్నాయి అని అన్నారు.

radhika sarathkumar comments on bandaru satyanarayana

అయితే, మరొక పక్క మరి కొంత మంది రాజకీయ ప్రముఖులు, “రోజా అంతకుముందు పవన్ కళ్యాణ్ భార్యని కూడా అనరాని మాటలు అన్నారు. అంతే కాకుండా చంద్రబాబు నాయుడు లాంటి వారిని కూడా ఏవేవో మాటలు అన్నారు. అప్పుడు మీరు అందరూ ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు మీకు ఒక మహిళని అవమానించడం తప్పు అనే విషయం ఎందుకు గుర్తు రాలేదు?” అంటూ ఈ విషయం మీద తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక విషయం మీద కూడా కామెంట్స్ వస్తున్నాయి.

jabardast rojaa

అదేంటంటే కొంతకాలం క్రితం రజనీకాంత్ ని కూడా కొన్ని మాటలు మాట్లాడారు. ఆయనని ట్రోల్ చేశారు. “అప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? సినీ కుటుంబంలోని ఒకరినే కదా అలాంటి మాటలు అన్నది? మరి అప్పుడు వీళ్ళందరూ ఎందుకు స్పందించలేదు?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు అప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. “అప్పుడు కూడా రోజా కొన్ని మాటలు మాట్లాడారు. కానీ ఆ సమయంలో ఇలాంటి మాటలు తప్పు అని ఎవరు వచ్చి మాట్లాడలేదు. మరి వాళ్ళ విషయంలో జరిగితే మాత్రం తప్పు కాదు.”

meaning of pawan kalyan dialogue in hungry cheetah og glimpse

“రోజా విషయంలో మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడితే తప్పు అవుతుందా? అప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు?” అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంక రజనీకాంత్ విషయానికి వస్తే, ఇటీవల జైలర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రజనీకాంత్, ఇప్పుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా పనిలో బిజీగా ఉన్నారు.

ఇందులో రజనీకాంత్ పోలీస్ పాత్రలో నటిస్తారు అని సమాచారం. ఈ దర్శకుడు అంతకుముందు జై భీమ్ సినిమా రూపొందించారు. ఇప్పుడు ఈ సినిమా కూడా ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగానే రూపొందిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ తో పాటు, అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కూడా నటిస్తున్నారు.

ALSO READ : ఎలక్షన్ 2023 : ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి..? ఎలాంటి పనులు చేయకూడదు..?


End of Article

You may also like